World Athletics Championships 2022:. ఫైనల్స్‌కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా

22 Jul, 2022 09:31 IST|Sakshi

ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్, భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరో సారి తన సత్తా చాటాడు. అమెరికాలోని యుజీన్‌ వేదికగా జరుగుతోన్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌-2022 ఫైనల్‌కు నీరజ్ చోప్రా చేరుకున్నాడు. శుక్రవారం ఉదయం జరిగిన గ్రూప్-ఏ జావెలిన్‌ త్రో క్వాలిఫికేషన్ రౌండ్‌ తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల దూరం విసిరి  నీరజ్ ఫైనల్లో అడుగుపెట్టాడు. ఇక అతడితో పాటు మరో భారత త్రోయర్‌ రోహిత్‌ యాదవ్‌ కూడా  ఫైనల్స్‌కు చేరుకున్నాడు.

అంతకుముందు అన్నూ రాణి మహిళల జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఫైనల్స్‌ భారత కాలమానం ప్రకారం ఆదివారం జరగనున్నాయి. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా పతకం సాధిస్తే.. రెండో భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టిస్తాడు. 2003లో పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత లాంగ్‌ జంపర్‌  అంజూ బాబి జార్జ్‌ కాంస్య పతకం నెగ్గింది. ప్రపంచ  అథ్లెటిక్స్  చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు భారత్‌ కేవలం ఒకే ఒక పతకం మాత్రమే సాధించింది.


చదవండిIND vs WI: విరాట్‌ కోహ్లికి రెస్ట్‌ అవసరమా..? అసలే ఫామ్‌ కోల్పోయి..!

మరిన్ని వార్తలు