డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ బరిలో నీరజ్‌

8 Sep, 2022 05:34 IST|Sakshi

ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ మీట్‌లో పసిడి పతకమే లక్ష్యంగా భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా బరిలోకి దిగనున్నాడు. జ్యూరిక్‌లో ఈరోజు డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ జరగనుంది.

జావెలిన్‌ త్రో ఫైనల్లో నీరజ్‌తో కలిపి మొత్తం ఆరుగురు పోటీపడనున్నారు. 2017, 2018 డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ మీట్‌కు నీరజ్‌ అర్హత సాధించినా పతకం సాధించలేకపోయాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో సంచలనం సృష్టించిన నీరజ్‌ ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతంతో మెరిశాడు.  

మరిన్ని వార్తలు