Sandeep Lamichhane: ఢిల్లీ క్యాపిటల్స్‌ మాజీ ఆటగాడిపై అత్యాచార యత్నం కేసు నమోదు

7 Sep, 2022 17:07 IST|Sakshi

ఢిల్లీ క్యాపిటల్స్‌ మాజీ ఆటగాడు, నేపాల్‌ జాతీయ క్రికెట్‌ జట్టు సారధి సందీప్‌ లామిచ్చెన్‌పై అత్యాచార యత్నం కేసు నమోదైంది. సందీప్‌ అభిమానిగా చెప్పుకునే 17 ఏళ్ల మైనర్‌ బాలిక అత్యాచార అరోపణలు చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సందీప్‌పై కేసు నమోదు చేశారు. 

గౌశాల మెట్రోపాలిటిన్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖాట్మండుకు చెందిన మైనర్‌ బాలిక సందీప్‌ లామిచ్చెన్‌ ఆటకు వీరాభిమానినని చెప్పుకుంది. గత కొద్దికాలంగా సందీప్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతూ వస్తున్న ఆ అమ్మాయి.. నానా తంటాలు పడి తన అభిమాన క్రికెటర్‌ ఫోన్‌ నంబర్‌ సంపాదించింది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా సందీప్‌తో వాట్సాప్‌లో చాటింగ్‌ చేస్తుండేది.

దీన్ని ఆసరాగా తీసుకున్న సందీప్‌.. బాలికను పర్సనల్‌గా కలవాలని కోరాడు. ఈ క్రమంలో గత నెల (ఆగస్ట్‌) 21న వీరిద్దరు ఓ హోటల్‌ గదిలో కలిశారు. ఆ సమయంలో సందీప్‌ రెండుసార్లు అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆ అమ్మాయి తెలిపింది. మైనర్‌ స్టేట్‌మెంట్‌ను పరిగణలోకి తీసుకున్న పోలీసులు సందీప్‌పై కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. గతేడాదే నేపాల్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా ఎంపికైన సందీప్‌.. ప్రస్తుతం కెన్యా పర్యటనలో ఉన్నాడు. లెగ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అయిన సందీప్‌.. ఈ ఏడాది ఐపీఎల్‌ మెగా వేలంలో అమ్ముడుపోని సరుకుగా మిగిలిపోయాడు. 
చదవండి: దేశం కోసం గెలవాలన్న కసి టీమిండియాలో పోయింది.. ఐపీఎల్‌ బాయ్‌కాట్‌ చేస్తేనే..!

మరిన్ని వార్తలు