Aasif Sheikh Viral Video: బంగారం లాంటి అవకాశం వదిలేశాడు..

15 Feb, 2022 10:25 IST|Sakshi

క్రికెట్‌లో క్రీడాస్పూర్తి చాలా తక్కువగా కనిపిస్తుంది. తాము ఓడిపోతామని తెలిసి కూడా ప్రత్యర్థి జట్లకు మేలు చేయడం అప్పుడప్పుడు చూస్తుంటాం. మనది తప్పు అని తేలితే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ఔట్‌ చేయకుంటే దానిని క్రీడాస్పూర్తి అనొచ్చు. తాజాగా నేపాల్‌, ఐర్లాండ్‌ మధ్య మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ నేపాల్‌ బౌలర్‌ కమల్‌ సింగ్‌ వేశాడు.  ఓవర్‌ రెండో బంతిని మార్క్ అడైర్ మిడ్‌వికెట్‌ దిశగా ఆడాడు.

చదవండి: తండ్రి ఫెయిలైన ఎలక్ట్రిషియన్‌.. తెలుగుతేజం తిలక్‌వర్మ కథేంటి

బంతి ఎక్కువ దూరం పోనప్పటికి సింగిల్‌ పూర్తి చేయొచ్చనే ఉద్దేశంతో మార్క్‌ నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న ఆండీ మెక్‌బ్రైన్‌కు కాల్‌ ఇచ్చాడు. అయితే బంతి కోసం పరిగెడుతూ ఆండీ మెక్‌బ్రైన్‌ను కింద పడేసుకుంటూ వెళ్లాడు. బంతిని అందుకున్న కమల్‌.. కీపర్‌ ఆసిఫ్‌ షేక్‌కు త్రో విసిరాడు. ఔట్‌ చేసే అవకాశం వచ్చినప్పటికి ఆసిఫ్‌ బెయిల్స్‌ను పడగొట్టకుండా క్రీడాస్పూర్తి ప్రదర్శించాడు. ఈలోగా ఆండీ మెక్‌బ్రైన్‌ సురక్షితంగా క్రీజులోకి చేరాడు. దీంతో ఆసిఫ్‌ క్రీడాస్పూర్తిని మెచ్చుకుంటూ ఇరుజట్ల ఆటగాళ్లు అభినందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక మ్యాచ్‌లో ఐర్లాండ్‌ జట్టు నేపాల్‌పై 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

చదవండి: ‘మేం దూరదృష్టితో ఆలోచిస్తాం’

మరిన్ని వార్తలు