60 బంతుల్లో సెంచరీ; ఒంటిచేత్తో సూపర్‌ క్యాచ్‌.. అయినా ఓడిపోయింది

15 Sep, 2021 13:35 IST|Sakshi

దుబాయ్‌: ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లీగ్‌లో(సీడబ్య్లూసీ) భాగంగా నేపాల్‌, ఒమన్‌, యూఎస్‌ఏల మధ్య ట్రై సిరీస్‌ జరుగుతుంది. కాగా నేపాల్‌, ఒమన్‌ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో నేపాల్‌ ఆటగాడు రోహిత్‌ పౌడెల్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌తో మెరిశాడు. బౌండరీ లైన్‌ వద్ద ఒమన్‌ బ్యాట్స్‌మన్‌ జతీంధర్‌ సింగ్‌ ఇచ్చిన క్యాచ్‌ను పౌడెల్‌ బౌండరీ రోప్‌కు తగలకుండా ఎగిరి ఒంటిచేత్తో తీసుకున్నాడు. అనంతరం బంతిని విసిరేసి బౌండరీ లైన్‌ ఇవతలకు వచ్చి క్యాచ్‌ను అందుకున్నాడు. మెరుపు సెంచరీతో ఆకట్టుకున్న జతీంధర్‌ అవుట్‌ కావడంతో నేపాల్‌ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్‌లో షేర్‌ చేయగా.. అది వైరల్‌గా మారింది.

చదవండి: CPL 2021: వికెట్‌ తీశానన్న ఆనందం.. బౌలర్‌ వింత ప్రవర్తన


ఒమన్‌ బ్యాట్స్‌మన్‌ జతీంధర్‌ సింగ్‌(62 బంతుల్లో 102 పరుగులు)

ఈ మ్యాచ్‌లో ఒమన్‌ ఘన విజయాన్ని అందుకుంది. నేపాల్‌ విధించిన 197 పరుగుల లక్ష్యాన్ని ఒమన్‌ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 31.1 ఓవర్లలోనే చేధించింది. ఒమన్‌ ఓపెనర్‌ జతీంధర్‌ సింగ్‌ 62 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ అందుకొని సత్తా చాటాడు. అతని ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు. ఓవరాల్‌గా 107 పరుగులు చేసిన జతీంధర్‌ రోహిత్‌ పౌడేలా అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. అప్పటికే లక్ష్యాని చేరువ కావడంతో మహ్మద్‌ నదీమ్‌ 38 నాటౌట్‌ మిగతా పనిని పూర్తి చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.  అంతకముందు నేపాల్‌ జట్టు 47.4 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. ఆసిఫ్‌ షేక్‌ (90 పరుగులు, 7 ఫోర్లు, 1 సిక్సర్‌)తో రాణించగా.. మిగతావారు విఫలమయ్యారు. ఒమన్‌ బౌలర్లలో బిలాయ్‌ ఖాన్‌ 4 వికెట్లు తీయగా.. నెస్టర్‌ దాంబా రెండు వికెట్లు తీశాడు.

చదవండి: IPL 2021 Phase 2: ఇరగదీసిన డివిల్లియర్స్‌.. సిక్సర్ల వర్షం.. కానీ సెంచరీ వృథా!

మరిన్ని వార్తలు