కోహ్లి ట్వీట్‌పై నెట్‌ఫ్లిక్స్ సంబరం

18 Nov, 2020 11:11 IST|Sakshi

సిడ్నీ:నచ్చిన వ్యక్తితో ఫోటో దిగితే మనకు కలిగే ఆనందం అంతాఇంతా కాదు. అసలు ఆ రోజ నిద్ర పడితే ఒట్టు..! అలాంటి గొప్ప అనుభూతి‌ నెట్‌ఫ్లిక్స్‌కు శనివారం ఎదురైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో క్వారంటైన్‌లో ఉన్న కెప్టెన్‌ కోహ్లీ .. ‘ క్వారంటైన్‌ డైరీస్‌.. ఇస్త్రీ చేయని టీ షర్ట్‌, సౌకర్యవంతమైన సోఫా, చూడటానికి మంచి సిరీస్‌’ అంటూ  వెబ్‌ సిరీస్‌ చూస్తున్న ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. దీనిపై స్పందించిన నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా విరాట్ కోహ్లీతో ఫోటో దిగాలనే కల నిజమైందంటూ ట్విటర్‌లో పేర్కొంది. ఈ ట్వీట్‌కు మూడు వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో‌ అదిరిపో​యే వెబ్‌ సీరిస్‌లు ఉన్నాయంటూ కోహ్లి అభిమానులు చెప్తున్నారు. మీర్జాపూర్ , డార్క్‌ ,‌ వంటి వెబ్‌ సిరీస్‌లు చూడాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు