-

ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్‌ వచ్చేసింది..

27 Jul, 2020 14:26 IST|Sakshi

దుబాయ్‌:  2023లో భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా క్వాలిఫికేషన్‌ రౌండ్‌కు రంగం సిద్ధమైంది.  దీనిలో భాగంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) కొత్త వన్డే సూపర్‌ లీగ్‌ను నిర్వహించనుంది. ఈ మేరకు ఆరంభపు క్వాలిఫికేషన్‌ రౌండ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ఐర్లాండ్‌ తలపడనుంది. గురువారం ఇరు జట్ల మధ​ సౌతాంప్టన్‌ వేదికగా మ్యాచ్‌ జరుగనుంది. మొత్తం 13 దేశాలు పాల్గొనే ఈ సూపర్‌ లీగ్‌లో 12 ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం కల్గిన దేశాలతో పాటు నెదర్లాండ్స్‌కు పోటీ పడనుంది. ఈ క్వాలిఫికేషన్‌ రౌండ్‌కు నెదర్గాండ్స్‌ గతంలోనే అర్హత సాధించింది. 2015-17లో నిర్వహించిన ఐసీసీ వరల్డ్‌ క్రికెట్‌ సూపర్‌ లీగ్‌లో విజేతగా నిలవడం ద్వారా నెదర్లాండ్స్‌ వరల్డ్‌కప్‌- 2023 క్వాలిఫికేషన్‌ రేసులో నిలిచింది.  ఈ సూపర్‌ లీగ్‌లో ప్రతీ జట్టు నాలుగు స్వదేశీ మ్యాచ్‌ల సిరీస్‌ను మరో నాలుగు విదేశీ మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడాల్సి ఉంటుంది. ఇవి మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా జరగనున్నాయి. (క్రికెట్‌ మ్యాచ్‌కు ప్రేక్షకులు షురూ)

మొత్తం పది దేశాలు పాల్గొనే వరల్డ్‌కప్‌లో ఐసీసీ పూర్తిస్థాయి సభ్యత్వం కల్గిన ఎనిమిది దేశాలు(ఆతిథ్య దేశం భారత్‌తో కలుపుకుని) ఆటోమేటిక్‌గా ఆ టోర్నీకి అర్హత సాధిస్తుండగా, మరో రెండు దేశాల కోసం క్వాలిఫికేషన్‌ రౌండ్‌ నిర్వహిస్తున్నారు. ఆతిథ్యం దేశం అనేది నేరుగా మెగా టోర్నీకి క్వాలిఫై అయ్యే విషయం తెలిసిందే.  అదే సమయంలో టాప్‌ స్థానాల్లో ఉన్న మరో ఏడు పూర్తిస్థాయి సభ్య దేశాలు కూడా పోటీకి నేరుగా క్వాలిఫై అవుతాయి. 

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వన్డే క్రికెట్‌తో పాటు టి 20 ప్రపంచ కప్‌ షెడ్యూల్‌లు వాయిదాలు పడ్డాయి. ఆ క్రమంలోనే సూపర్‌ లీగ్‌ కూడా ఆలస్యమైంది.  ఈ లీగ్‌ను మే నెలలోనే నిర్వహించాల్సి ఉండగా, కరోనాతో అది ఆలస్యమైంది. కొత్త సూపర్ లీగ్‌లో సిరీస్‌ను కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించడానికి ఆయా జాతీయ బోర్డులతో కలిసి పని చేయడానికి ఐసీసీ నడుంబిగించింది. కాగా, 2023 వరల్డ్‌కప్‌కు ఇంకా చాలా సమయం ఉండటంతో అర్హత ప్రక్రియకు ఎటువంటి ఆటంకాలు ఉండవని ఐసీసీ భావిస్తోంది.  గత ఏడాది ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో భాగంగా నిర్వహించిన క్వాలిఫైయింగ్ విధానాన్నే తాజా అర్హత ప్రక్రియకు అవలంభిస్తున్నారు. మొత్తం 13 దేశాలు పాల్గొనే ఈ లీగ్‌లో 156 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 2022 చివరి వరకూ సూపర్‌ లీగ్‌ కొనసాగనుంది. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం 2023 వరల్డ్‌కప్‌ను ఫిబ్రవరిలో నిర్వహించాల్సి ఉండగా, తాజా షెడ్యూల్‌లో మార్పుల వల్ల ఆ మెగా టోర్నీని ఆ ఏడాది అక్టోబర్‌కు పొడిగించారు.(బీసీసీఐ తీరు దారుణం: యువరాజ్‌)

మరిన్ని వార్తలు