'పాకిస్తాన్‌లో పర్యటించనున్న న్యూజిలాండ్‌.. ఇప్పుడు భయం పోయిందా'

20 Dec, 2021 13:13 IST|Sakshi

భద్రతా కారణాల దృష్ట్యా ఆర్ధంతరంగా పాకిస్తాన్‌ పర్యటను రద్దు చేసుకున్న న్యూజిలాండ్‌ మళ్లీ పాకిస్తాన్‌లో పర్యటించనుంది. వచ్చే ఏడాదిలో పాకిస్తాన్‌లో తమ జట్టు పర్యటించనుందని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు సోమవారం ప్రకటన చేసింది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, ఐదు టీ20లతో పాటు రెండు టెస్ట్‌లు కూడా కివీస్‌ ఆడనుంది. నవంబర్‌లో దుబాయ్‌లో ఇరు జట్ల క్రికెట్ బోర్డులు సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన రెండు క్రికెట్ బోర్డుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని న్యూజిలాండ్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్  డేవిడ్‌ వైట్‌ అన్నారు. 

"మా బోర్డు చైర్మన్‌ మార్టిన్ స్నెడెన్, పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ రమీజ్‌ రాజా ఇద్దరూ దుబాయ్‌లో చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో మా జట్టు వచ్చే ఏడాది ఆ దేశ పర్యటనకు వెళ్లనుంది. దీంతో రెండు దేశాల బంధం మరింత బలపడతుంది" అని డేవిడ్‌ వైట్‌ పేర్నొన్నారు. ఇక ఈ విషయంపై రమీజ్‌ రాజా మాట్లడూతూ.. న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. తమ దేశంలో పర్యటించడానికి ఒప్పుకున్నందుకు చైర్మన్‌ మార్టిన్ స్నెడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు. 2022-23 ఏడాదికి గాను రెండు సార్లు పాక్‌ పర్యటనకు కివీస్‌ రానుందని అతను చెప్పారు. ఈ పర్యటనపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రమీజ్‌ రాజా పేర్కొన్నారు.
చదవండి: SA Vs IND: భారత పర్యటన.. ఆ మ్యాచ్‌లను వాయిదా వేసిన దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు!

మరిన్ని వార్తలు