న్యూజిలాండ్‌దే టి20 సిరీస్‌

8 Mar, 2021 06:00 IST|Sakshi
గప్టిల్‌

వెల్లింగ్టన్‌: సిరీస్‌ విజేతను తేల్చే నిర్ణాయక ఐదో టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఏడు వికెట్లతో ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్‌ను 3–2తో సొంతం చేసుకుంది. తొలుత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. వేడ్‌ (44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఫించ్‌ (36; 5 ఫోర్లు, సిక్స్‌) మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. ఇష్‌ సోధి 3 వికెట్లు తీయగా... సౌతీ, బౌల్ట్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం న్యూజిలాండ్‌ 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి నెగ్గింది. గప్టిల్‌ (71, 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), గ్లెన్‌ ఫిలిప్స్‌ (34 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)   మెరిపించి కివీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు