ENG VS NZ 3rd Test: ఐదేసిన జాక్‌ లీచ్‌.. ఇంగ్లండ్‌ టార్గెట్‌ 296

26 Jun, 2022 20:31 IST|Sakshi

హెడింగ్లే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ రసకందాయంగా మారింది. 168/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కివీస్‌ ఇంగ్లండ్‌కు 296 పరుగుల ఊరించే టార్గెట్‌ను నిర్ధేశించింది. 

కివీస్‌ బ్యాటర్లలో టామ్‌ లాథమ్‌ (76), డారిల్‌ మిచెల్‌ (56), టామ్‌ బ్లండెల్‌ (88 నాటౌట్‌) అర్ధశతకాలు సాధించగా.. ఇంగ్లండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ 5, మ్యాటీ పాట్స్‌ 3, జేమీ ఓవర్టన్‌, జో రూట్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఐదేసిన లీచ్‌.. తాజా ప్రదర్శనతో 10 వికెట్ల ఘనతను నమోదు చేశాడు.

అంతకుముందు డారిల్‌ మిచెల్‌ (109), టామ్‌ బ్లండెల్‌ (55) రాణించడంతో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్‌ కాగా, ఇంగ్లండ్‌.. బెయిర్‌స్టో (157 బంతుల్లో 24 ఫోర్ల సాయంతో 162 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్‌ సాయంతో 360 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది.

ఇక, 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉన్న ఇంగ్లండ్‌ గత మ్యాచ్‌ తరహాలోనే వేగంగా పరుగులు సాధించి న్యూజిలాండ్‌పై వరుసగా మూడో టెస్ట్‌ విజయాన్ని సాధించాలని భావిస్తుంది. ఇంగ్లండ్‌ బ్యాటర్లు ఆరంభం నుంచి కివీస్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగి నాలుగో రోజు ఆఖరి సెషన్‌లో వీలైనన్ని పరుగులు సాధించాలని అనుకుంటారు. రెండో టెస్ట్‌లో బెయిర్‌స్టో (136), స్టోక్స్‌ (75 నాటౌట్‌) ఇదే ఫార్ములాను అప్లై చేసి సక్సస్‌ అయ్యారు. 
చదవండి: ఇంగ్లండ్‌ జట్టులోనూ కరోనా కలకలం.. కీలక ఆటగాడికి పాజిటివ్‌గా నిర్ధారణ

మరిన్ని వార్తలు