New Zealand Squads: విలియమ్సన్‌ లేకుండానే వరుస సిరీస్‌లు.. జట్లు ఇవే! కెప్టెన్లు ఎవరంటే!

21 Jun, 2022 11:08 IST|Sakshi
ఇంగ్లండ్‌తో టెస్టుకు సన్నద్ధమవుతున్న కివీస్‌ జట్టు(PC: NZ Cricket)

New Zealand White-ball Tours to Ireland, Scotland and the Netherlands: న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు రానున్న రెండు నెలలు బిజీబిజీగా గడుపనుంది. జూలైలో ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌లలో పర్యటించనున్న కివీస్‌ ఆటగాళ్లు.. ఆగష్టులో నెదర్లాండ్స్‌ టూర్‌కు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి మూడు దేశాలతో సిరీస్‌కు న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు తమ జట్లను ప్రకటించింది.

కాగా జూలై 10న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో వన్డే సిరీస్‌ ఆరంభించనున్న కివీస్‌.. మొత్తంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత జూలై 27 నుంచి స్కాట్లాండ్‌తో వరుసగా రెండు టీ20లు, ఒక వన్డే ఆడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. 

అదే విధంగా.. ఆగష్టు 4, 6 తేదీల్లో నెదర్లాండ్స్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు న్యూజిలాండ్‌ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆయా సిరీస్‌లకు ప్రకటించిన జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్‌ జట్టు
టామ్‌ లాథమ్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), ఫిన్‌ అలెన్‌, మిచెల్‌ బ్రాస్‌వెల్‌, డేన్‌ క్లీవర్‌(వికెట్‌ కీపర్‌), జాకోబ్‌ డాఫీ, లాకీ ఫెర్గూసన్‌, మార్టిన్‌ గప్టిల్‌, మ్యాట్‌ హెన్రీ, ఆడమ్‌ మిల్నే, హెన్రీ నికోల్స్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌ సాంట్నర్‌, ఇష్‌ సోధి, బ్లేర్‌ టిక్నెర్‌, విల్‌ యంగ్‌.

ఐర్లాండ్‌ టీ20 సిరీస్‌, స్కాట్లాండ్‌, నెదర్లాండ్స్‌తో సిరీస్‌లకు కివీస్‌ జట్టు:
మిచెల్‌ సాంట్నర్‌(కెప్టెన్‌), ఫిన్‌ అలెన్‌, మిచెల్‌ బ్రేస్‌వెల్‌, మార్క్‌ చాప్‌మన్‌, డేన్‌ క్లీవర్‌(వికెట్‌ కీపర్‌), లాకీ ఫెర్గూసన్‌, మార్టిన్‌ గప్టిల్‌, ఆడం మిల్నే, డారిల్‌ మిచెల్‌, జిమ్మీ నీషమ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల్‌ రిప్పన్‌, బెన్‌ సీర్స్‌, ఇష్‌ సోధి, బ్లేర్‌ టిక్నెర్‌.

కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగమైన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, ఇతర సీనియర్లు టిమ్‌ సౌథీ, ట్రెంట్‌ బౌల్ట్‌ తదితరులు లేకుండానే కివీస్‌ ఈ పర్యటనలు చేయనుంది. వీరికి విశ్రాంతినిచ్చేందుకు బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో జట్టుకు దూరమయ్యారు. ఇక విలియమ్సన్‌ స్థానంలో టామ్‌ లాథమ్‌, మిచెల్‌ సాంట్నర్‌ ఆయా సిరీస్‌లకు సారథ్య బాధ్యతలు చేపట్టనున్నారు. అదే విధంగా హెడ్‌కోచ్‌ గ్యారీ స్టెడ్‌ బ్రేక్‌ తీసుకోగా.. షేన్‌ జర్గన్‌సన్‌ ఆయన స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.

చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక టెస్టు.. చెమటోడుస్తున్న టీమిండియా.. ఫోటోలు వైరల్‌!

మరిన్ని వార్తలు