కొత్తగా మూడు దేశాలకు ఐసీసీ సభ్యత్వం

19 Jul, 2021 20:53 IST|Sakshi

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కొత్తగా మూడు దేశాలకు సభ్యత్వం ఇచ్చింది. దీంతో ఐసీసీ సభ్య దేశాల సంఖ్య 106కు చేరింది. ఆసియా ఖండం నుంచి మంగోలియా, తజకిస్థాన్‌.. యూరప్‌ నుంచి స్విట్జర్లాండ్‌కు ఐసీసీ సభ్యత్వాలు ఇచ్చింది. ఆదివారం వర్చువల్‌గా జరిగిన 78వ సర్వసభ్య సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కొత్తగా సభ్యత్వం లభించిన దేశాలు వారి వారి ప్రాంతాల్లో క్రికెట్‌ అభివృద్ధికి తోడ్పడాలని ఐసీసీ సూచించింది. అందుకు అవసరమైన మద్దతు తమవైపు నుంచి ఉంటుందని హామీ ఇచ్చింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు