NFT Auction: టీమిండియా విన్నింగ్‌ టీమ్‌ బ్యాట్‌.. ధర తెలిస్తే షాకే!

25 Dec, 2021 19:02 IST|Sakshi

Bat Signed by 2011 World Cup winning team fetches 25,000 USD.. క్రికెట్‌లో టీమిండియాకు '2011' ఒక గోల్డెన్‌ ఇయర్‌. 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ ధోని నాయకత్వంలోని టీమిండియా ప్రపంచకప్‌ను సాధించి చరిత్ర సృష్టించింది. 1983 కపిల్‌ డెవిల్స్‌ తర్వాత వన్డే వరల్డ్‌కప్‌ను అందుకున్న ఘనత ధోని సేనకే సాధ్యమైంది. ఇక శ్రీలంకతో జరిగిన ఆ ఫైనల్లో ధోని తన స్టైల్లో సిక్స్‌ కొట్టి టీమిండియాకు విజయాన్ని అందించి కప్‌ను చేతిలో పెట్టాడు. ఇక విజయం సాధించిన అనంతరం టీమిండియా చేసిన రచ్చ అంత తొందరగా మరిచిపోలేం.

భారత లెజెండరీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను తమ భుజాలపై మోస్తూ అతనికి ధోని సేన కప్‌ను గిఫ్ట్‌గా అందివ్వడం ఒక చరిత్ర. ఆరోజు ధోని ట్రోఫీ అందుకున్న తర్వాత.. టీమిండియా ఆటగాళ్లంతా ఒక బ్యాట్‌పై తమ సంతకాలను చేశారు. దానికి 2011 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ బ్యాట్‌ అని పేరు పెట్టారు. తాజాగా ఆ బ్యాట్‌కు నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌(ఎన్‌ఎఫ్‌టీ) రూపంలో భారీ ధర దక్కింది.

చదవండి: 'సంవత్సరాలు మారుతున్నాయి.. కానీ సేమ్‌ ఫీలింగ్‌'

ఇక క్రిక్‌ఫ్లిక్స్‌, రెవ్‌స్పోర్ట్స్‌, ఫనాటిక్‌ స్పోర్ట్స్‌ ఆధ్వర్యంలో కలిసి సంయుక్తంగా ఎన్‌ఎఫ్‌టీ వేలం నిర్వహించగా భారీ స్పందన లభించింది. మొత్తంగా డిజిటల్‌ ఆర్టిక్రాప్ట్‌కు (335,950 అమెరికన్‌ డాలర్లు) ఎన్‌ఎఫ్‌టీ టోకెన్‌ రూపంలో బిడ్‌ వేశారు. ఇందులో టీమిండియా విన్నింగ్‌ టీమ్‌ బ్యాట్‌ ..వేలంలో 25వేల అమెరికన్‌ డాలర్లు పలికింది. ఇండియన్‌ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.18 లక్షలకు పైనే ఉంటుంది.

అయితే ఇంతకముందు 2016లో  ఎస్‌ఆర్‌హెచ్‌  ఐపీఎల్‌ చాంపియన్స్‌గా  నిలవడంలో కీలకపాత్ర పోషించిన జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ సంతకం చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ జెర్సీకి ఎన్‌ఎఫ్‌టీ రూపంలో 30వేల అమెరికన్‌ డాలర్లు(ఇండియన్‌ కరెన్సీలో రూ.22 లక్షలుపైన) పలకింది. దుబాయ్‌ వేదికగా ఈ ఎన్‌ఎఫ్‌టీ వేలం నిర్వహించారు. ఇక సచిన్‌ టెండూల్కర్‌ 200 టెస్టులు పూర్తి చేసుకున్న సందర్భంగా సచిన్‌ క్రికెట్‌ కలెక్షన్‌ పేరుతో డిజిటర్‌ రైట్స్‌ రూపంలో వేలం నిర్వహించారు. ఈ ఎన్‌ఎఫ్‌టీ టోకెన్‌ను టెండూల్కర్‌ వీరాభిమాని.. ముంబైకి చెందిన అమల్‌ ఖాన్‌ 40వేల అమెరికన్‌ డాలర్లకు(ఇండియన్‌ కరెన్సీలో రూ .30,01,410) దక్కించుకోవడం విశేషం.

చదవండి: Dinesh Karthik: తొలి భారత ప్లేయర్‌గా రికార్డు సృష్టించనున్న దినేష్‌ కార్తీక్‌...!

ఎన్‌ఎఫ్‌టీ అంటే..!
బ్యాంకులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఆర్థిక వ్యవహరాలు చక్కదిద్దుకునేలా డిజిటల్‌ మార్కెట్‌లో క్రిప్టోకరెన్సీ ఇప్పుడు ఒక ట్రెండ్‌గా కొనసాగుతోంది. బిట్‌ కాయిన్‌, డిగో కాయిన్‌, ఈథర్‌నెట్‌ వంటి క్రిప్టో కరెన్సీలు డబ్బుకి సమాంతర ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నాయి. ఇదే తరహాలో సెలబ్రిటీలు, ఇ-సెలబ్రిటీలకు సంబంధించిన మాటలు, పాటలు, ఆటలు, నటన, ప్రత్యేక సంభాషణలు సైతం డిజిటల్‌ ఫార్మాట్‌లోకి మార్చి బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ ఆధారంగా వేలంలో అమ్మేస్తారు.

క్రిప్టో కరెన్సీ ఎంత భద్రంగా ఉంటుందో ఈ ఆర్ట్‌ వర్క్‌ కూడా అంతే భద్రంగా ఉంటుంది. సెలబ్రిటీకు సంబంధించిన ఈ డిజిటల్‌ ఎస్సెట్స్‌, దాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులకే చెందుతుంది. వీటినే నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టోకెన్లతో బ్లాక్‌ చైయిన్‌ టెక్నాలజీలో ఉండే క్రిప్టో కరెన్సీలో లావాదేవీలు చేసుకునే వీలుంది. డీ సెంట్రలైజ్డ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అందించే యాప్‌లలోనూ వీటిని అమ్మకం, కొనుగోలు చేయవచ్చు.

చదవండి: NFT: ఎన్‌ఎఫ్‌టీలో పెట్టుబడులు పెట్టిన ఇండియన్‌ సెలబ్రిటీస్‌ వీళ్లే..

మరిన్ని వార్తలు