‘ఆ స్థితిలో బ్యాటింగ్‌ వద్దే వద్దు’

16 Oct, 2020 17:38 IST|Sakshi

షార్జా:  ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ చివరి బంతికి గెలిచినా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించడం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చింది. వరుస ఓటముల తర్వాత కింగ్స్‌ పంజాబ్‌ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ స్టార్‌ ప్లేయర్‌ క్రిస్‌ గేల్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫస్ట్‌ డౌన్‌లో వచ్చినా తడబాటు లేకుండా ఆచితూచి బ్యాటింగ్‌ చేశాడు గేల్‌.  45 బంతుల్లో   1 ఫోర్‌, 5 సిక్స్‌లతో 53 పరుగులు సాధించిన గేల్‌ తన విలువ ఏమిటో చూపించాడు. మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన గేల్‌పై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. యూనివర్శల్‌ బాస్‌ అని ముద్దుగా పిలుచుకునే గేల్‌ను సహచర ఆటగాడు నికోలస్‌ పూరన్‌ కొనియాడాడు. (గెలిచారు కదా.. మొహం అలా పెట్టావేంటి?)

‘నా ప్రకారం గేల్‌ ఒక గ్రేటెస్ట్‌  టీ20 ప్లేయర్‌. గేల్‌ బ్యాటింగ్‌ చేస్తుంటే విజయం సాధించే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. గేల్‌ ఒకసారి క్రీజ్‌లోకి వెళ్లాడంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఆర్సీబీతో మ్యాచ్‌లో మెల్లగా ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. చాలాకాలం నుంచి గేల్‌ క్రికెట్‌ ఆడటం లేదు. కానీ మళ్లీ గ్రేటెస్ట్‌ టీ20 ప్లేయర్‌ అని నిరూపించుకున్నాడు. గేల్‌ పరుగులు సాధిస్తుంటే అద్భుతంగా ఉంటుంది. చివరి ఓవర్‌లో మూడు బంతులకు పరుగు మాత్రమే  వచ్చింది.  దాంతో నాకు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ గుర్తుకొచ్చింది. డగౌట్‌లో ఉన్న నాలో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అవి చాలా గందరగోళానికి గురి చేశాయి. చివరి బంతికి నాకు బ్యాటింగ్‌ చేసే అవకాశం చాలా కాలం తర్వాత వచ్చింది. అంత ఉత్కంఠగా ఉన్నప్పుడు ఎప్పుడూ బ్యాటింగ్‌ చేయాలని ఎప్పుడూ కోరుకును. అటువంటి స్థితిలో బ్యాటింగ్‌ వద్దే వద్దు.. కూర్చొని కూర్చొని ఆఖరి బంతికి బ్యాటింగ్‌కు దిగిన సమయంలో ఏమి చేస్తాననే ఆందోళన ఉంది. ఆ బంతి మ్యాచ్‌ను  డిసైడ్‌ చేసే కావడంతో టెన్షన్‌ పడ్డా. మ్యాచ్‌ను సిక్స్‌తో ముగించినందుకు ఆనందంగా ఉంది’ అని మ్యాచ్‌ తర్వాత మయాంక్‌ అగర్వాల్‌తో తన అనుభవాన్ని షేర్‌ చేసుకున్నాడు పూరన్‌.(ఈ పేరుకు కొంచెం గౌరవం ఇవ్వండి : గేల్‌)

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు