Nikhat Zareen: నిఖత్ జరీన్‌ను అభినందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత

24 Aug, 2022 15:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: కామన్వెల్త్ క్రీడలు- 2022లో బంగారు పతకం సాధించిన తెలంగాణ బాక్సర్‌ నిఖత్ జరీన్‌ను ఎమ్మెల్సీ కవిత బుధవారం తన నివాసంలో కలిశారు. ప్రతిష్టాత్మక క్రీడల్లో పసిడి పంచ్‌ విసిరి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన నిఖత్‌ను అభినందించారు. ఈ సందర్భంగా కవిత సాయం చేసిన విషయాన్ని నిఖత్‌ గుర్తు చేసుకున్నారు.

తనను సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారని.. ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో రూ.50 లక్షలు మంజూరు చేశారని ఆమె అన్నారు. అదే విధంగా రూ.2 కోట్లు మంజూరు చేయడం, నివాస స్థలం కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రపంచ చాంపియన్‌ నిఖత్‌ జరీన్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇక నిఖత్‌ విజయాలను ప్రస్తావిస్తూ.. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌గా నిలవడం గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని ఎ ప్రశంసించారు. కాగా కామన్వెల్త్ గేమ్స్-2022 మహిళల 50 కిలోల బాక్సింగ్‌ విభాగంలో నిఖత్‌ స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే.

చదవండి: IPL- Punjab Kings: మయాంక్‌ అగర్వాల్‌పై వేటు! స్పందించిన పంజాబ్‌ ఫ్రాంఛైజీ! ఇంతకీ ఏం చెప్పినట్టు?
KL Rahul Wedding: టీమిండియా వైస్‌ కెప్టెన్‌ పెళ్లి ఆమెతోనే! ధ్రువీకరించిన ‘మామగారు’.. కానీ ట్విస్ట్‌ ఏంటంటే!

మరిన్ని వార్తలు