-

T20 WC 2022: "అతడొక అద్భుతం.. ఒంటి చెత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉంది'

11 Nov, 2022 09:49 IST|Sakshi

సెమీఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఘోర ఓటమితో టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి ఇంటిముఖం పట్టింది. అయితే తొలి టీ20 ప్రపంచకప్‌ ఆడిన అర్ష్‌దీప్‌ సింగ్‌ మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో 6 మ్యాచ్‌లు ఆడిన అర్ష్‌దీప్‌ 10 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి భారత విజయంలో అర్ష్‌దీప్‌ కీలక పాత్ర పోషించాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైన్లలో మిగితా బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. అర్ష్‌దీప్‌ మాత్రం 2 ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అర్ష్‌దీప్‌ సింగ్‌పై భారత మాజీ క్రికెటర్‌ నిఖిల్‌ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 ప్రపంచకప్‌లో దొరికిన అణిముత్యం అని చోప్రా కొనియాడాడు. 
క్రిక్‌ ట్రాకర్‌తో నిఖిల్‌ చోప్రా మాట్లాడూతూ.. "ఈ టోర్నీలో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ ఒకడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అతడు కొత్త బంతితో బౌలింగ్‌ చేసే విధానం అద్భుతమైనది. యార్కర్లు, స్లో బంతులు వేయడం అతడి ప్రధాన బలాలు. అదే విధంగా డెత్‌ ఓవర్లలో ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా  బౌలింగ్‌ చేసే సత్తా అర్ష్‌దీప్‌కు ఉంది.

అతడు రాబోయే రోజుల్లో భారత జట్టకు కీలక బౌలర్‌గా మారుతాడు. ఈ మెగా ఈవెంట్‌లో ఆడిన అనుభవం అతడికి మరింత మెరుగైన బౌలర్‌గా పరిణితి చెందడానికి ఉపయోగపడుతుంది. అవసరమైన సమయంలో ఆట మొత్తాన్ని మార్చేసే ఓవర్ వేసి జట్టును గెలిపించే సత్తా అర్ష్‌దీప్‌ ఉంది" అని చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: T20 WC 2022: 'టీమిండియా తదుపరి కెప్టెన్‌ అతడే.. సీనియర్లు గుడ్‌బై చెప్పనున్నారు'

మరిన్ని వార్తలు