PAK Vs SL 2nd Test: లంక క్రికెటర్‌తో పవాద్‌ ఆలం వైరం.. ఇలా కూడా గొడవ పడొచ్చా!

27 Jul, 2022 08:20 IST|Sakshi

శ్రీలంక క్రికెటర్‌ నిరోషన్‌ డిక్‌వెల్లా, పాక్‌ క్రికెటర్‌ పవాద్‌ ఆలం మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది. గొడవ సీరియస్‌ అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. సరదాగా గొడవ పడిన ఈ ఇద్దరి చర్య సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నిరోషన్‌ డిక్‌వెల్లా పవాద్‌ ఆలంను ఉద్దేశించి ఏదో అనగా.. దానికి పవాద్‌ కూడా కౌంటర్‌ ఇచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన లంక కెప్టెన్‌ కరుణరత్నే, పాక్‌ పేసర్‌ హారిస్‌ రౌఫ్‌లు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందా అని చూడడానికి వచ్చారు. గొడవ కాదని కేవలం ఫన్నీగా జరుగుతున్న సంభాషణ అని తెలుసుకొని వాళ్లు కూడా ఈ గొడవలో జాయిన్‌ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోనూ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ట్విటర్‌లో షేర్‌ చేసింది.

ఇక పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆతిధ్య శ్రీలంక పట్టుబిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు  రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి ఓవరాల్‌గా 323 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కెప్టెన్‌ కరుణరత్నే (27), ధనంజయ (30) నిలకడగా ఆడుతున్నారు. తొలి టెస్టులో పాక్‌ 342 పరుగుల లక్ష్య చేధనను సులువుగా చేధించడంతో ఈసారి మాత్రం అవకాశం ఇవ్వకూడదని లంక భావిస్తోంది. అందుకే పాక్‌కు భారీ టార్గెట్‌ ఇచ్చే యోచనలో ఉన్నారు.

చదవండి: ICC Men's Cricket Committee: ఐసీసీలో వివిఎస్‌ లక్ష్మణ్‌కు కీలక పదవి

మరిన్ని వార్తలు