రూల్స్‌ బ్రేక్‌తో భారీ ఫైన్‌.. బికినీలు వేసుకోవాలని రాద్ధాంతం చేస్తున్నారన్న ఆటగాళ్లు

21 Jul, 2021 16:54 IST|Sakshi

బ్రసెల్స్‌: బ‌ల్గేరియాలో జరిగిన యురోపియ‌న్ మహిళల బీచ్ హ్యాండ్‌బాల్‌ ఛాంపియ‌న్‌షిప్ పోటీల్లో నార్వే జట్టుకు యురోపియ‌న్ హ్యాండ్‌బాల్ ఫెడ‌రేష‌న్ (ఈహెచ్‌ఎఫ్‌) భారీ జ‌రిమానా విధించింది. టోర్నీలో భాగంగా స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్వే జట్టు సభ్యులు బికినీలకు బదులు షార్ట్‌లు వేసుకుని బరిలోకి దిగినందుకు 1500 యూరోలు ఫైన్ వేసినట్లు ఈహెచ్‌ఎఫ్‌ ప్రకటించింది. రూల్స్‌కు వ్యతిరేకంగా అనుమతి లేని దుస్తులు ధరించి మ్యాచ్‌ ఆడినందుకు డిసిప్లినరి యాక్షన్‌ కింద జరిమానా విధించినట్లు వెల్లడించింది. 

అయితే ఈహెచ్‌ఎఫ్‌ నిర్ణయంపై నార్వే జట్టు అధికారులు విస్మ‌యం వ్య‌క్తం చేశారు. డ్రెస్‌ కోడ్‌ విషయంలో 2006 నుంచి పోరాటం చేస్తున్నామని, సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం ఆటగాళ్ల హక్కు అని, ఈ విషయంలో ఈహెచ్‌ఎఫ్‌ అనవసర రాద్దాంతం చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో తాము ప్లేయర్స్‌కు మద్దతుగా నిలుస్తామని, అలాగే వారికి విధించిన జరిమానాను తామే చెల్లిస్తామని తెలిపారు. కాగా, అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ రూల్స్‌ ప్రకారం మహిళా అథెట్లు తప్పనిసరిగా బికినీలు ధరించే బరిలోకి దిగాలి.

A post shared by Norges Håndballforbund (@norgeshandballforbund)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు