కెప్టెన్‌ ఒకటి, కోచ్‌ మరొకటి అంటే కష్టమే: ధోని

5 Oct, 2020 18:07 IST|Sakshi

దుబాయ్‌: తమ జట్టు సెలక్షన్‌ గురించి కానీ, పొజిషన్స్‌ గురించి కానీ డ్రెస‍్సింగ్‌ రూమ్‌లో పెద్దగా చర్చలు లేకపోయినా ఒక ప్రణాళిక అయితే కచ్చితంగా ఉంటుందని సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని స్పష్టం చేశాడు. అలా అని కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌తో తాను ఏమీ చర్చించనని కాదనే విషయం గ్రహించాలన్నాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఒక ప్లాన్‌ను సిద్ధం చేసుకుంటామని దాన్నే అంతా అవలంభిస్తామన్నాడు. ఒకసారి ఫీల్డ్‌లోకి దిగాక అంతా ఒకరినొకరు సహరించుకుంటామన్నాడు. జట్టు ఎంపిక,  స్థానాల గురించి ఫ్లెమింగ్‌తో పెద్దగా చర్చించననేది వాస్తవం కాదన్నాడు. ఫీల్డ్‌లో ప్లాన్‌లు ఎలా అమలు చేయాలనే దానిపై కోచ్‌గా ఫ్లెమింగ్‌ పాత్ర ఉంటుందన్నాడు.ఎప్పుట్నుంచో కొనసాగుతున్న  ఫ్లెమింగ్‌కు సాధ్యమైనంత గుర్తింపు దక్కలేదని తాను తరుచు భావిస్తూ ఉంటానని ధోని తెలిపాడు. (చదవండి: ఇలా ఆడితే మీ కథ ముగిసినట్లే: గంభీర్‌)

కింగ్స్‌ పంజాబ్‌పై ఘన విజయం తర్వాత మాట్లాడిన ధోని..‘  ఇదొక గొప్ప విజయం.మేము గత జట్టుతోనే దిగి సత్తాచాటడం నిజంగానే గర్వంగా ఉంది. మా ప్లానింగ్‌లో కోచ్‌గా ఫ్లెమింగ్‌ రోల్‌ వెలకట్టలేనిది. సీఎస్‌కేకు ఫ్లెమింగ్‌ చాలా చేశాడు. కానీ అతని దక్కాల్సిన క్రెడిట్‌ ఏదైతే ఉందో అది మాత్రం దక్కలేదు. మేము జట్టుగా బరిలో దిగేటప్పుడు ఒక ప్లాన్‌తో దిగుతాం. ఎక్కువ చర్చలు లేకపోయినా ప్లానింగ్‌ అనేది ఉంటుంది. అక్కడ దీన్ని ఎవరు అంగీకరించినా, అంగీకరించక పోయినా మ్యాచ్‌ నాటికి మాత్రం అంతా ఒకతాటిపైనే ఉంటాం. దాన్నే ఆ మ్యాచ్‌ రోజు అమలు చేస్తాం. ఎప్పుడైనా కోచ్‌ వేరే కోణంలో ఆలోచించి, కెప్టెన్‌ మరొక కోణంలో ఆలోచిస్తే అది చాలా కష్టంగా ఉంటుంది. అటువంటప్పుడు గందరగోళానికి దారి తీస్తుంది. కానీ మా జట్టులో ప్రతీది అంతా చర్చిస్తాం. అది ఇన్‌సైడ్‌ రూమ్‌లోని జరుగుతుంది. ఒకసారి బయటకు వచ్చాక మేము ఒకర్ని ఒకరు సపోర్ట్‌ చేసుకుంటాం. అలా అని సెలక్షన్‌ విషయంలో క్రికెటర్ల పొజిషన్ల విషయంలో మా మధ్య చర్చలు ఏమీ నడవని కాదు. అది మా ఇద్దరి మధ్య ఒక అవగాహన ఉంటుంది. ఫ్లెమింగ్‌తో నా రిలేషన్‌షిప్‌ అనేది చాలా సుదీర్ఘంగా కొనసాగుతూ వస్తుంది. తొలి ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత నుంచి ఫ్లెమింగ్‌ మాతో ఉన్నాడు. ఫ్లెమింగ్‌ది సీఎస్‌కేతో చాలా లాంగ్‌ జర్నీ’ అని ధోని తెలిపాడు.

ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది. ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌, డుప్లెసిస్‌ విశేషంగా రాణించడంతో సీఎస్‌కే భారీ విజయం నమోదు చేసింది. అయితే వాట్సన్‌ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. వాట్సన్‌ను జట్టులో ఉంచాలా.. తీసేయాలా అనే విషయంలో సీఎస్‌కే డ్రెస్సింగ్‌ రూమ్‌లో చర్చ నడిచినట్లు తెలుస్తోంది. కాకపోతే చివరకు వాట్సన్‌ తీసుకోవడమే కాకుండా అతను రాణించడంతో సీఎస్‌కే బెంగ తీరింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు