IND vs AUS: శుబ్‌మన్‌ గిల్‌ వద్దు.. శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో అతడే సరైనోడు

5 Feb, 2023 10:15 IST|Sakshi

బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్‌ వేదికగా జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టాయి కూడా. కాగా 2017 తర్వాత తొలిసారిగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో భారత్ టెస్టు సిరీస్‌ ఆడనుంది. ఇక తొలి టెస్టుకు భారత్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయాస్ అయ్యర్ ఆడేది అనుమానంగానే ఉంది.

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు అయ్యర్‌ గాయపడిన సంగతి తెలిసిందే. అయ్యర్‌ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో పునరావసం పొందుతున్నాడు.  అతడు ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించలేదు. అయితే ఫిబ్రవరి 17 నుంచి ఢిల్లీ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు అయ్యర్‌ అందుబాటులో ఉండే అవకాశం ఉంది అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

గిల్‌ వద్దు.. అతడే కరక్ట్‌
ఒక వేళ తొలి టెస్టు అయ్యర్‌ దూరమైతే అతడు స్థానంలో ఎవరని ఆడించాలన్న చర్చ ప్రస్తుతం నడుస్తోంది. కొంతమంది అయ్యర్‌ స్థానంలో యువ ఆటగాడు శుబ్‌మాన్‌ గిల్‌కు అవకాశం ఇవ్వాలని, మరి కొందరు సూర్యకుమార్‌ యాదవ్‌కు ఛాన్స్‌ ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత వెటరన్‌ వికెట్‌కీపర్‌ తన అభిప్రాయాలను వెల్లడించాడు.

క్రిక్‌బజ్‌తో కార్తీక్‌ మాట్లాడుతూ..
తొలి టెస్టుకు అయ్యర్‌ అందుబాటులో లేకుంటే ఆ స్థానంలో సూర్యకుమార్ యాదవ్- గిల్‌లో ఎవరని ఆడించాలన్న చర్చ జరుగుతోంది. నా వరకు అయితే అయ్యర్‌ స్థానంలో  సూర్యకుమార్‌ను ఆడితే బాగుంటుంది.

ఎందుకుంటే అతడు స్పిన్‌కు అద్భుతంగా ఆడగలడు. అదే విధంగా ఈ సిరీస్‌ జరగబోయే కొన్ని పిచ్‌లు స్పిన్‌ అనుకూలిస్తాయి. కాబట్టి అతడికి తుది జట్టులో అవకాశం ఇవ్వండి. అదే విధంగా  సూర్య రెడ్-హాట్ ఫామ్‌లో ఉన్నాడు అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: Virat vs Rohit: రోహిత్‌, విరాట్‌ మధ్య గొడవలు నిజమే.. చక్కదిద్దింది అతడే!

మరిన్ని వార్తలు