ఒలింపిక్స్‌పై ఏ నిర్ణయం తీసుకోలేదు: జొకోవిచ్‌

13 Jul, 2021 05:49 IST|Sakshi

లండన్‌: ఈ నెల 23న మొదలయ్యే టోక్యో ఒలింపిక్స్‌ క్రీడల్లో ఆడాలా... వద్దా అనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ పేర్కొన్నాడు. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో విజేతగా నిలిచాక ఒలింపిక్స్‌పై జొకోవిచ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఒలింపిక్స్‌ గురించి ఇంకా ఆలోచించాల్సి ఉంది. నేనెప్పుడూ అందులో పాల్గొనాలనే కోరుకుంటా. కానీ, కోవిడ్‌–19, క్వారంటైన్‌ నిబంధనలు, అభిమానులు లేకుం డా గేమ్స్‌ జరగనుండటం వంటి అంశాల వల్ల అందులో నేను పాల్గొనేది 50–50గా ఉంది’ అని జొకోవిచ్‌ అన్నాడు. 2008 బీజింగ్‌ ఒలిం పిక్స్‌లో తొలిసారి పాల్గొన్న జొకోవిచ్‌ కాంస్యం గెలిచాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఓడిపోగా... 2016 రియో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు