ఒక్క దెబ్బతో జొకోవిచ్ ఔట్‌

7 Sep, 2020 09:50 IST|Sakshi
లైన్‌ జడ్జ్‌ పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్న జకోవిచ్‌

జొకోవిచ్ కొంపముంచిన అసహనం

న్యూయార్క్‌ :  వరల్డ్‌ నంబర్‌వన్, సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ తన ఫ్రస్టేషన్‌ కారణంగా యూఎస్‌ ఓపెన్‌నుంచి డిస్‌ క్వాలిఫై అయ్యాడు. ఆదివారం  యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భాగంగా టెన్నిస్‌ ఓపెనింగ్‌ సెట్‌లో ప్రత‍్యర్థి పాబ్లో కార్రెనో బుస్టాపై 5-6 తేడాతో వెనుకబడ్డాడు. వరుసగా మూడు సెట్‌ పాయింట్లన వృథా చేసుకోవడంతో ఫ్రస్టేషన్‌కు గురైన జొకోవిచ్‌ బ్యాట్‌తో బంతిని కోర్టు బయటకు కొట్టాడు. బంతి నేరుగా వెళ్లి లైన్‌ జడ్జ్‌ (మహిళ) గొంతుకు తాకింది. ఇది గమనించిన అతను‌ వెంటనే ఆమె వద్దకు నడిచాడు. బాధతో ఆమె నేలపై కూర్చుండిపోయింది. ( జొకోవిచ్‌ మనసు మార్చుకున్నాడు )

అతడు ఆమెకేమైందో అడిగి తెలుసుకుని, తన తప్పుకు క్షమాపణ చెప్పాడు. అయితే ఉద్ధేశ్యపూర్వకంగా ఆమెను కొట్టకపోయినా.. లైన్‌ జడ్జ్‌ను గాయపరిచినందుకు గానూ గేమ్‌ రూల్స్‌ ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవల్సిన పరిస్థితి వచ్చింది. కానీ, అధికారులు తనపై చర్యలు తీసుకోవటం ఇష్టం లేని జొకోవిచ్‌ వెంటనే స్టేడియంనుంచి బయటకు వెళ్లిపోయాడు.

 

మరిన్ని వార్తలు