Novak Djokovic: మ్యాచ్‌ ఓడిపోయానన్న బాధ.. రాకెట్‌ను నేలకేసి కొట్టి

1 Aug, 2021 10:40 IST|Sakshi

టోక్యో: కెరీర్‌లో లోటుగా ఉన్న ఒలింపిక్‌ స్వర్ణ పతకంతో పాటు క్యాలెండర్‌ సంవత్సరంలో ‘గోల్డెన్‌ స్లామ్‌’ సాధించాలనే లక్ష్యంతో టోక్యోకు వచ్చిన టెన్నిస్‌ వరల్డ్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) తీవ్ర నిరాశతో వెనుదిరిగాడు. పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో ఓడిన అతను ... మూడో స్థానం కోసం ఆడాల్సిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌ కూడా ఆడకుండానే తప్పుకున్నాడు. దాంతో అతనికి ఈ ఒలింపిక్స్‌లో శూన్య హస్తం దక్కింది.

శనివారం జరిగిన సింగిల్స్‌ మ్యాచ్‌లో పాబ్లో కారెనో బుస్టా (స్పెయిన్‌) 6–4, 6–7 (6/8), 6–3తో జొకోవిచ్‌ను ఓడించాడు. మ్యాచ్‌లో పలుమార్లు జొకోవిచ్‌ సహనం కోల్పోయాడు. ఒకసారి రాకెట్‌ను ప్రేక్షకుల్లోకి విసిరేసిన అతను, మరోసారి తన రాకెట్‌తో నెట్‌పై బలంగా పదే పదే కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పాపం జొకోవిచ్‌.. జొకోవిచ్‌కు ఏమైంది.. ఇప్పటికే కెరీర్‌లో చాలా సాధించావు.. ఒలింపిక్స్‌ పోతే పోయింది.. మరేం పర్లేదు.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు