VIDEO: యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో మరోసారి బయటపడ్డ వెర్రితనం! రాకెట్‌ విరగొట్టి.. బాల్‌గర్ల్‌ను భయపెట్టి..

13 Sep, 2021 13:45 IST|Sakshi

ఆయనో టెన్నిస్‌ ఛాంపియన్‌.  ఎన్నో విజయాలు.. ఖాతాలో ఎన్నో గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీలు.  పైగా ర్యాంకింగ్‌లోనూ నెంబర్‌ వన్‌.  కోట్లలో అభిమానులు. కానీ, అదే స్థాయిలో ద్వేషించేవాళ్లూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అందుకు కారణం.. ఆట ఆడడం కన్నా కోర్టులో ఆయన ప్రవర్తించే తీరు. యూఎస్‌ ఓపెన్‌ 2021 ఫైనల్‌ సాక్షిగా అది మరోసారి బయటపడింది. ‘ఇదేం ఆటిట్యూడ్‌ గురూ!’ అంటూ..  జొకోవిచ్‌ను సోషల్‌ మీడియా ఏకీపడేస్తోంది. 


ఆటలో నిజాయితీ, అవతలి ఆటగాడిపై గౌరవం, ఓడినా గెలిచినా స్పోర్టివ్‌గా తీసుకునే తత్వం.. ఇవేవీ 34 ఏళ్ల సెర్బియన్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌లో లేవనే చాలామంది చెప్పేస్తుంటారు. జొకోవిచ్‌కు హేటర్స్‌ ఎక్కువే. కానీ, ఆ హేటర్స్‌ ఇగ్నోర్‌ చేసేంత రేంజ్‌లో లేకపోవడమే అసలు సమస్య.  అది యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ మరోసారి వెల్లడైంది. రష్యన్‌ ప్లేయర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌(25) చేతిలో  వరుస సెట్స్‌ ఓడిపోతూ ఉంటే.. ఆ కోపాన్ని తట్టుకోలేక రాకెట్‌ను నేలకేసి విరకొట్టాడు జొకోవిచ్‌.  అందుకే మ్యాచ్‌ను వీక్షిస్తున్న క్రౌడ్‌ నుంచి కాసేపు ‘బూ’ నినాదాలు వినిపించాయి. ఇక ఓడిపోతున్నాననే ఫ్రస్టేషన్‌ను బాల్‌ గర్ల్‌పై చూపించబోయాడు. ఇలా రెండుసార్లు ఇలా జరిగింది.  కాస్తుంటే ఆ రాకెట్‌ను అమ్మాయిపై విసిరిసేవాడేమో. సరే విసిరేయలేదు కదా అనుకున్నా.. అలాంటి ప్రవర్తన సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

జోకర్‌ బెస్టే కానీ.. 
అభిమానులు.. అభిమానించని వాళ్లూ జొకోవిచ్‌ను ‘జోకర్‌’(Djocker) అని ముద్దుగా పిలుస్తుంటారు. అందుకు కారణం.. కోర్టులో అతని ప్రవర్తన.  బేసిక్‌గా సరదా మనిషి అయిన జొకోవిచ్‌.. కోర్టులో కోతి చేష్టలతో చూసేవాళ్ల పెదాలపై నవ్వులు పూయిస్తుంటాడు. ఒక్కోసారి క్రౌడ్‌ దగ్గరగా వెళ్లి ఇంటెరాక్షన్‌ కావడంతో పాటు సందర్భానికి తగ్గట్లు ఆట మధ్యలోనే సెన్సాఫ్‌ హ్యూమర్‌ ప్రదర్శిస్తుంటాడు. సిల్లీ హ్యబిట్స్‌తో పాటు ఫన్నీ గెస్చర్స్‌తో నవ్విస్తుంటాడు. అందుకే జోకర్‌ అనే పేరు ముద్రపడింది. అయితే ఇతర ఆటగాళ్లను సైతం ఇమిటేట్‌ చేసే జొకోవిచ్‌.. ఒక్కోసారి హద్దు మీరి ప్రవర్తిస్తుంటారు కూడా.  రికార్డుల మీద, విజయాల ఉన్న ధ్యాస.. కోర్టులో ఎలా ప్రవర్తించడం అనేదాని మీద ఉండదనేది జొకోవిచ్‌ మీద ఉన్న ప్రధాన ఫిర్యాదు. ఇదే విషయాన్ని టెన్నిస్‌ దిగ్గజాలు సైతం చాలా ఇంటర్వ్యూలలో ఖుల్లాగా చెప్పేస్తుంటారు. ఆ లెక్కన ఈ ప్రపంచ ఛాంపియన్‌ అసలు ‘ఫెయిర్‌ ప్లేయర్‌’ కాదనేది ఇప్పుడు సోషల్‌ మీడియా కోడై కూడుస్తున్న మాట.

 
 
కొత్తేం కాదు.. 
మ్యాచ్‌ మధ్యలో జొకోవిచ్‌కు ఈ తరహాలో ప్రవర్తించడం కొత్తేం కాదు. టోక్యో  ఒలింపిక్స్‌ 2020లో కాంస్య పోరు సందర్భంగా రాకెట్‌ను దూరంగా విసిరిపడేశాడు. అంతకు ముందు చాలాసార్లు చేశాడు. అయినా ఆటలో గెలుపోటములు సహజం. కానీ, ఒక ఛాంపియన్‌ హోదాలో ఇలా ప్రవర్తించడం మాత్రం సరికాదన్న అభిప్రాయం హేటర్స్‌ నుంచే కాదు.. సీనియర్స్‌ నుంచి, అతన్ని అభిమానించే వాళ్ల నుంచి సైతం వినిపిస్తోంది ఇప్పుడు.

చదవండి: US Open 2021- ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్!

మరిన్ని వార్తలు