మూడో రౌండ్‌లో జొకోవిచ్‌

4 Sep, 2021 05:56 IST|Sakshi

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–2, 6–3, 6–2తో టలాన్‌ (నెదర్లాండ్స్‌)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో 12వ సీడ్‌ హలెప్‌ (రొమేనియా) ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. మూడో రౌండ్‌లో హలెప్‌ 7–6 (13/11), 4–6, 6–3తో రిబాకినా (కజకిస్తాన్‌)పై గెలిచింది. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సానియా మీర్జా (భారత్‌)–కోకో వాండవే (అమెరికా) జంట 6–4, 4–6, 3–6తో రలుకా (రొమేనియా)–కిచెనోక్‌ (ఉక్రెయిన్‌) జోడీ చేతిలో ఓడింది.

మరిన్ని వార్తలు