IND vs NZ 2nd Test: తొలి రోజు ముగిసిన ఆట.. మయాంక్ అగర్వాల్ సెంచరీ..

4 Dec, 2021 08:35 IST|Sakshi

IND Vs NZ 2nd Test  Live Updates: సమయం: 17:34.. న్యూజిలాండ్‌, టీమిండియా మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 70 ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ సెంచరీతో మెరిశాడు. తన కేరిర్‌లో మయాంక్‌ నాలుగో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం మయాంక్‌ అగర్వాల్‌ 120, వృద్ధిమాన్ సాహా 25 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఆజాజ్‌ పటేల్‌ ఒక్కడే నాలుగు వికెట్లు పడగొట్టాడు.

సమయం: 17:04.. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్ సెంచరీతో మెరిశాడు.  ప్రస్తుతం టీమిండియా 69 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. మయాంక్‌ 112, వృద్ధిమాన్ సాహా 25 పరుగులతో  క్రీజులో ఉన్నారు.

టీమిండియా ప్రస్తుత స్కోర్‌: 57 ఓవర్లు ముగిసేసరికి 182/4. మయాంక్‌ 95, వృద్ధిమాన్ సాహా 11 పరుగులుతో క్రీజులో ఉన్నారు

సమయం: 16:04.. 160 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. తొలి టెస్ట్‌లో సెంచరీ హీరో శ్రేయస్‌ అయ్యర్‌ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. 18 పరుగులు చేసిన అయ్యర్‌. అజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 

సమయం: 15:18PM.. టీమిండియా ప్రస్తుత స్కోర్‌: 43 ఓవర్లు ముగిసేసరికి 123/3. మయాంక్‌ 59, శ్రేయస్‌ అయ్యర్‌ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
 

సమయం: 14:18..  టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నిరాశపరిచాడు. అజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఎల్బీ అయిన కోహ్లి  డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం టీమిండియా 31 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. మయాంక్‌ 32, శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజులో ఉన్నారు.

సమయం: 14:08..  టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఎజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయిన పుజారా డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం టీమిండియా 30 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది.

గిల్‌(44) ఔట్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా
సమయం: 14:04.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టును నిలకడగా ఆరంభించిన టీమిండియా శుబ్‌మన్‌ గిల్‌(44) రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. గిల్‌ ఎజాజ్‌ పటేల్‌ బౌలింగ్‌లో రాస్‌ టేలర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 29 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 80 పరుగులు చేసింది. మయాంక్‌ 32, పుజారా క్రీజులో ఉన్నారు.

సమయం: 12:50.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆరంభించింది. 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ 15, శుబ్‌మన్‌ గిల్‌ 15పరుగులతో ఆడుతున్నారు.

సమయం: 11:45.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. రెండురోజులుగా కురిసిన వర్షాలకు ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో ఉదయం సెషన్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపయింది. లంచ్‌ విరామం తర్వాత టాస్‌ వేశారు.

టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండో టెస్టు కాస్త ఆలస్యంగా మొదలుకానుంది. గత రెండు రోజులుగా ముంబైలో వర్షం కురుస్తుండడంతో ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారింది. మైదానంలో తేమ ఎక్కువగా ఉన్న కారణంగా టాస్‌ను కాస్త ఆలస్యంగా వేయనున్నారు. కాగా గ్రౌండ్‌మెన్స్‌ 10:30 గంటలకు మరోసారి పరీక్షించనున్నారు. అయితే రెండో టెస్టు ఆరంభానికి ముందు టీమిండియాకు గట్టిషాక్‌ తగిలింది. గాయాలతో ఇబ్బందిపడుతున్న అజింక్య రహానే, ఇషాంత్‌ శర్మ, రవీంద్ర జడేజాలు మ్యాచ్‌కు దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మోచేతి గాయంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో టామ్‌ లాథమ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

భారత్: మయాంక్ అగర్వాల్, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), శ్రేయాస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్‌

న్యూజిలాండ్ : టామ్ లాథమ్ (కెప్టెన్‌), విల్ యంగ్, డారిల్ మిచెల్, రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, టామ్ బ్లండెల్ (వికెట్‌ కీపర్‌), రచిన్ రవీంద్ర, కైల్ జామీసన్, టిమ్ సౌతీ, విలియం సోమర్‌విల్లే, అజాజ్ పటేల్

మరిన్ని వార్తలు