IND Vs NZ 3rd T20: న్యూజిలాండ్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా.. మూడో టీ20లో ఘనవిజయం

21 Nov, 2021 18:11 IST|Sakshi

న్యూజిలాండ్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసిన టీమిండియా.. మూడో టీ20లో ఘనవిజయం 
ఈడెన్ గార్డెన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20ల్లో టీమిండియా 73పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 3-0 తేడాతో భారత్‌ క్లీన్ స్వీప్ చేసింది. 185 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. భారత బౌలర్ల ధాటికి 111 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్‌ బ్యాటర్‌లో గప్టిల్‌(51) తప్ప మిగితా బ్యాటర్‌లు ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ మూడు వికెట్లు పడగొట్టగా, చాహర్‌, హర్షల్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు సాధించారు.

అంతకముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.టీమిండియా బ్యాటర్లలో రోహిత్‌ శర్మ(56) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, కిషన్‌(29), శ్రేయాప్‌ అయ్యర్‌(25),దీపక్‌ చాహర్‌(21) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా, బౌల్ట్ రెండు వికెట్లు, సోధి, మిల్నే చెరో వికెట్‌ సాధించారు.

పీకల్లోతు కష్టా‍ల్లో న్యూజిలాండ్‌.. నీషమ్‌(3) ఔట్‌
185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్షర్‌ పటేల్‌ మూడు వికెట్లు పడగొట్టి కీవిస్‌ను  కోలుకోలేని దెబ్బతీశాడు. న్యూజిలాండ్‌ బ్యాటర్‌లో గప్టిల్‌(51) తప్ప మిగితా బ్యాటర్‌లు ఎవరూ రాణించలేదు. 16 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్‌ 6వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది.

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌
185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ వరుస క్రమంలో రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ వేసిన 3 ఓవర్‌లో తొలి బంతికే మిచెల్‌(5), హర్షల్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగగా, ఐదో బంతికి చాప్‌మాన్‌ స్టంప్‌ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 4 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్‌ రెండు వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గప్టిల్‌(24), ఫిలిప్స్‌(0) పరుగులతో ఉన్నారు.

చేలరేగిన భారత్‌.. కివీస్‌ టార్గెట్‌ 185 పరుగులు
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా చేలరేగి ఆడింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆర్ధ సెంచరీ తో  మెరిసాడు. ఒకనొక దశలో స్కోర్‌ బోర్డు 200 పరుగులు దాటుతుందని అంతా భావించనా.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో 184 పరుగులు మాత్రమే సాధించింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్‌ శర్మ(56) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, కిషన్‌(29), శ్రేయాప్‌ అయ్యర్‌(25),దీపక్‌ చాహర్‌(21) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా, బౌల్ట్ రెండు వికెట్లు, సోధి, మిల్నే చెరో వికెట్‌ సాధించారు.

ఐదో  వికెట్‌ కోల్పోయిన భారత్‌.. వెంకటేశ్‌ అయ్యర్‌(20)ఔట్‌
139 పరగుల వద్ద టీమిండియా  ఐదో వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన వెంకటేశ్‌ అయ్యర్‌ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో చాప్‌మాన్‌ కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 16 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి టీమిండియా 140 పరుగులు చేసింది. శ్రేయాస్‌ అయ్యర్‌(25) అక్షర్‌ పటేల్‌(0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌.. రోహిత్‌ (56)ఔట్‌
103 పరుగుల వద్ద టీమిండియా  రోహిత్‌ శర్మ రూపంలో బిగ్‌ వికెట్‌ కోల్పోయింది. అర్ధ సెంచరీ సాధించి మంచి ఊపు మీద ఉన్న రోహిత్‌, సోధి బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ప్రస్తుతం 12 ఓవర్లలో నాలుగు  వికెట్ల నష్టానికి టీమిండియా 108 పరుగులు చేసింది. శ్రేయాస్‌ అయ్యర్‌(13), వెంకటేశ్‌ అయ్యర్‌(3) పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా..
ధాటిగా ఆడుతున్న టీమిండియా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. మిచెల్ సాంట్నర్ వేసిన 7వ ఓవర్‌లో  రెండో బంతికి కిషన్‌(29) వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరగా, చివరి బంతికి సూర్యకూమార్‌ యాదవ్‌ డకౌట్‌ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 8 ఓవర్లలో రెండు వికెట్లు నష్టానికి టీమిండియా 77 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ42, పంత్‌ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్లు..
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ధాటిగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కిషన్‌ ఫోర్లు, సిక్స్‌రలతో కీవిస్‌ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ23, కిషన్‌15 పరుగులతో క్రీజులో ఉన్నారు.

కోల్‌కతా: న్యూజిలాండ్-భారత్‌ మధ్య మూడో టీ20 మ్యాచ్‌ ఈడెన్ గార్డెన్‌ వేదికగా ఆదివారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో భారత్‌ బరిలోకి దిగుతుంది. రాహుల్ స్ధానంలో ఇషాన్‌ కిషన్‌ రాగా, అశ్విన్  స్ధానంలో చాహల్‌కు చోటు దక్కింది. ఇక ఈ మ్యాచ్‌కు సౌథీ దూరం కావడంతో మిచెల్ సాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే రెండు టీ20లు గెలిచిన భారత జట్టు.. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు కనీసం అఖరి మ్యాచ్‌లో అయినా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని న్యూజిలాండ్ అనుకుంటున్నది.

భారత్‌రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్, రిషభ్‌ పంత్, శ్రేయస్, వెంకటేశ్‌ అయ్యర్, అక్షర్‌ పటేల్‌ , దీపక్‌ చహర్, చాహల్, భువనేశ్వర్, హర్షల్‌ పటేల్‌

న్యూజిలాండ్‌: మిచెల్ సాంట్నర్(కెప్టెన్‌) మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫెర్ట్(వికెట్‌ కీపర్‌), జేమ్స్ నీషమ్, ఇష్ సోధి, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్,లాకీ ఫెర్గూసన్

చదవండి: క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన బీసీసీఐ.. వ‌చ్చే ఐపీఎల్ ఎక్కడంటే..

మరిన్ని వార్తలు