Tim Southee: టిమ్‌ సౌథీ అరుదైన ఘనత.. సరికొత్త రికార్డు.. 700 వికెట్లతో..

24 Feb, 2023 16:01 IST|Sakshi
టిమ్‌ సౌథీ (PC: Blackcaps)

New Zealand vs England, 2nd Test: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టిమ్‌ సౌథీ కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. అంతేకాదు.. ఈ ఘనత సాధించిన తొలి కివీస్‌ పేసర్‌గా ఈ రైట్‌ ఆర్మ్‌ సీమర్‌ చరిత్ర సృష్టించాడు.

ఇంగ్లండ్‌తో స్వదేశంలో రెండో టెస్టు తొలి రోజు ఆట సందర్భంగా 34 ఏళ్ల టిమ్‌ సౌథీ ఈ ఫీట్‌ సాధించాడు. ఇంగ్లండ్‌ ఓపెనర్‌  బెన్‌ డకెట్‌(9 పరుగులు)ను అవుట్‌ చేసి తన కెరీర్‌లో 700వ వికెట్‌ నమోదు చేశాడు. తద్వారా కివీస్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ డానియెల్‌ వెటోరి(705)తో పాటు 700 వికెట్ల క్లబ్‌లో చేరాడు.

కాగా టిమ్‌ సౌథీ ఇప్పటి వరకు న్యూజిలాండ్‌ తరఫున మొత్తంగా 353 మ్యాచ్‌లు ఆడి.. టెస్టుల్లో 356, వన్డేల్లో 210, టీ20లలో 134 వికెట్లు కూల్చాడు. ఇక రెండు టెస్టుల సిరీస్‌ ఆడే నిమిత్తం ఇంగ్లండ్‌ న్యూజిలాండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంతా తొలి టెస్టులో ఆతిథ్య కివీస్‌ను 267 పరుగుల తేడాతో స్టోక్స్‌ బృందం చిత్తు చేసింది.

ఇక రెండో టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సరికి 65 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. రూట్‌, బ్రూక్‌ సెంచరీలతో చెలరేగగా.. బజ్‌బాల్‌ విధానంతో మరోసారి దూకుడు ప్రదర్శించి పటిష్ట స్థితిలో నిలిచింది. కివీస్‌ బౌలర్లలో సౌథీ ఒకటి, మ్యాట్‌ హెన్రీ రెండు వికెట్లు తీశారు. జో రూట్‌ 101 పరుగులు, హ్యారీ బ్రూక్‌ 184 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

చదవండి: WC 2023: కన్నీటి పర్యంతమైన హర్మన్‌... అక్కున చేర్చుకున్న అంజుమ్‌.. వీడియో వైరల్‌
Ind Vs Aus: భారత పిచ్‌లపై ఆస్ట్రేలియా నిందలు.. ఐసీసీ రేటింగ్‌ ఎలా ఉందంటే!
ENG vs NZ: చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచంలో తొలి క్రికెటర్‌గా!

A post shared by Spark Sport (@sparknzsport)

మరిన్ని వార్తలు