తమీమ్‌ ఇక్బాల్‌పై వేటు

27 Sep, 2023 02:39 IST|Sakshi

వన్డే వరల్డ్‌ కప్‌ మరో ఎనిమిది రోజుల్లో..

వరల్డ్‌ కప్‌కు బంగ‍్లాదేశ్‌ జట్టు!

ఢాకా: వన్డే వరల్డ్‌ కప్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల బంగ్లాదేశ్‌ జట్టును బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) మంగళవారం ప్రకటించింది. సీనియర్‌ బ్యాటర్‌ తమీమ్‌ ఇక్బాల్‌కు ఇందులో చోటు దక్కలేదు. వెన్నునొప్పితో బాధపడుతున్న అతను పూర్తి ఫిట్‌గా లేకపోగా, ఫిట్‌నెస్‌ సమస్యలు ఉన్న ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయరాదంటూ కెపె్టన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ డిమాండ్‌ చేయడం కూడా ప్రధాన కారణం. రిటైర్మెంట్‌ ప్రకటించి, దేశ ప్రధాని జోక్యంతో దానిని వెనక్కి తీసుకొని, కెపె్టన్సీకి రాజీనామా చేసి ఆపై కివీస్‌తో రెండు వన్డేలు ఆడిన తర్వాతా తమీమ్‌కు వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కలేదు.
జట్టు వివరాలు: షకీబ్‌ (కెపె్టన్‌), లిటన్‌ దాస్, తన్‌జీద్, నజ్ముల్, ముషి్ఫకర్, తౌహీద్, మిరాజ్, మహ్ముదుల్లా, మెహదీ హసన్, నసుమ్, మహమూద్, తస్కీన్, షరీఫుల్, ముస్తఫిజుర్, తన్‌జీమ్‌.

హసరంగ, చమీరా దూరం..
కొలంబో: వరల్డ్‌ కప్‌లో శ్రీలంక తమ ఇద్దరు ప్రధాన బౌలర్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరా సేవలు కోల్పోనుంది. గాయాలతో బాధపడుతున్న వీరిద్దరు మెగా టోర్నీకి దూరమయ్యారు.  
జట్టు వివరాలు: షనక (కెప్టెన్‌), కుశాల్‌ పెరీరా, నిసాంకా, కరుణరత్నే, కుశాల్‌ మెండిస్, సమరవిక్రమ, అసలంక, ధనంజయ, హేమంత, వెలలాగె, తీక్షణ, పతిరణ, కుమార, రజిత, మదుషంక.

మరిన్ని వార్తలు