అథ్లెట్‌ ద్యుతి చంద్‌ ఫిర్యాదు.. ‘ఫోకస్‌ ప్లస్‌’ ఎడిటర్‌ అరెస్టు

5 Sep, 2021 14:55 IST|Sakshi
సుధాంశు శేఖర్‌ రౌత్‌

అథ్లెట్‌ ద్యుతి చంద్‌ వివాదంలో పోలీసుల చర్యలు

రూ.5 కోట్ల పరువు నష్టం దావా దాఖలు 

భువనేశ్వర్‌: ఫోకస్‌ ప్లస్‌ వెబ్‌ చానల్‌ ఎడిటర్‌ సుధాంశుశేఖర్‌ రౌత్‌ అరెస్ట్‌ అయ్యారు. ప్రముఖ స్ప్రింటరు ద్యుతి చంద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. సదరు మీడియా ప్రతినిధి తనకు వ్యతిరేకంగా అవమానకరమైన ప్రసారాలు చేసి, మానసిక వేదనకు గురిచేసినట్లు నగరంలోని మహిళా పోలీస్టేషన్‌లో ద్యుతి చంద్‌ ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పరువునష్టం దావా దాఖలు చేయగా, విచారణలో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివాదాస్పద చానల్‌ కార్యాలయం నుంచి కంప్యూటర్‌ ఇతర సామాగ్రిని జప్తు చేశారు.

చదవండి: Tokyo Paralympics: చెలరేగుతున్న భారత షట్లర్లు.. వరుసగా రెండో స్వర్ణం సొంతం


టోక్యో ఒలింపిక్స్‌లో ఆడుతుండగా, ద్యుతి చంద్‌ కుటుంబ వ్యవహారాలపై అసభ్యకర ప్రసారాలు చేస్తానని, ఎడిటర్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు. పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పాలని, లేకపోతే వీటిని ప్రసారం చేస్తానని పదేపదే బెదిరించడంతో మానసిక స్థైర్యం కోల్పోయి ఒలింపిక్స్‌లో తాను ఓడిపోయానని ద్యుతి చాంద్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ చర్యలకు వ్యతిరేకంగా దాదాపు రూ.5 కోట్ల వరకు పరువు నష్టం దావా దాఖలు చేసినట్లు సమాచారం.

బెయిలు నిరాకరణ.. 
స్ప్రింటరు ద్యుతి చంద్‌ని బెదిరించిన కేసులో అరెస్టయిన ఎడిటర్‌ సుధాంశు శేఖర్‌ రౌత్‌కి స్థానిక సబ్‌–డివిజినల్‌ జ్యుడీషియల్‌ మెజి్రస్టేట్‌ (ఎస్‌డీజేఎమ్‌) కోర్టు బెయిలు నిరాకరించింది. ప్రస్తుతం సుధాంశుతో పాటు ఆయన అనుచరుడు స్మృతి రంజన్‌ బెహరాకి కూడా న్యాయ స్థానం 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. సుధాంశు విచారణకు 7 రోజుల రిమాండ్‌కు పోలీస్‌ వర్గాలు అభ్యర్థించగా, కోర్టు ఒక్కరోజు రిమాండ్‌కు మాత్రమే అనుమతించడం విశేషం.

చదవండి: Jeanette Zacarias Zapata: బాక్సింగ్‌ రింగ్‌లో విషాదం.. 18 ఏళ్ల టీనేజ్‌ బాక్సర్‌ మృతి

మరిన్ని వార్తలు