ఆర్‌సీబీ ఐపీఎల్‌ థీమ్‌.. రోమాలు నిక్కబొడిచేలా 

18 Sep, 2020 13:44 IST|Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 2020 సీజన్‌కు సంబంధించి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తమ థీమ్‌సాంగ్‌ను విడుదల చేసింది. ఆర్‌సీబీ.. ఆర్‌సీబీ.. అంటూ మొదలయ్యే పాట.. రోమాలు నిక్కబొడుచుకునేలా సాగింది. జట్టు కెప్టెన్‌గా కోహ్లితో మొదలయ్యే పాట .. డివిలియర్స్‌, ఆరోన్‌ ఫించ్‌, క్రిస్‌ మోరిస్‌, చహల్‌తో పాటు ఇతర ఆటగాళ్లు పాట పాడుతూ జట్టును ఎంకరేజ్‌ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ లిస్ట్‌లో నిలిచింది. ఇప్పటికే ఆర్‌సీబీ ఐపీఎల్‌ థీమ్‌ సాంగ్‌ను 5లక్షలకు పైగా వీక్షించారు. ఐపీఎల్ 2020 టైటిల్‌ స్పాన్సర్‌గా డ్రీమ్‌11 వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.(‌చదవండి : 'ఆర్‌సీబీలో కోహ్లి, డివిలియర్స్‌ ఫేవరేట్‌ కాదు')

ఐపీఎల్ ప్రారంభమైన మొదటి సీజన్‌ నుంచి ఫేవరేట్‌గా బరిలోకి దిగుతూనే ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలే కపోయింది. ప్రతీసారి ఈ జట్టు అన్ని విభాగాల్లోని బలంగా కనిపిస్తున్నప్పటికీ అసలు సిసలు ఆటకు వచ్చేసరికి బలహీనపడుతోంది. పేపర్‌ పులులు అనే సామెత ఆర్సీబీకి అచ్చంగా సరిపోతుందేమే. 2009, 2016 లో ఫైనల్‌కు చేరడం మినహాయించి ఏ సీజన్‌లోనూ ఆకట్టుకోలేదు. 2019 సీజన్‌లోనూ ఆర్‌సీబీ చివరి ప్లేస్‌కు పరిమితమైంది. విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లకు ఈసారి వేలం ద్వారా ఆరోన్‌ పించ్‌, ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌లు కొత్తగా కలవడంతో జట్టు మరింత బలంగా తయారైంది. అంతేగాక బిగ్‌బాష్‌ లీగ్‌ లీగ్‌లో రాణించిన జోష్‌ ఫిలిప్పిని ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ కోసం ఆర్‌సీబీ కొనుగోలు చేయడం ప్రధాన ఆకర్షణగా మారింది.

అయితే బ్యాటింగ్‌ పరంగా చూస్తే బలంగా కనిపిస్తున్న ఆర్‌సీబీ బౌలింగ్‌లో మాత్రం బలహీనంగా ఉంది. చహల్‌ డేల్‌ స్టయిన్‌, ఉమేశ్‌ యాదవ్‌ మినహా చెప్పుకోదగ్గ బౌలర్లు మాత్రం లేరు. దీంతో ఈసారి లీగ్‌లో ఎలాంటి ప్రదర్శన ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా సెప్టెంబర్‌ 21న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆర్‌సీబీ తమ మొదటి మ్యాచ్‌ ఆడనుంది. 

మరిన్ని వార్తలు