Neeraj Chopra: ఒలింపిక్‌ రికార్డును సవరించాల్సి ఉంది

16 Sep, 2021 08:19 IST|Sakshi

ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడంతోనే తన లక్ష్యం పూర్తి కాలేదని, మున్ముందు మరింతగా శ్రమించి 90.57 మీటర్ల ఒలింపిక్‌ రికార్డును సవరించాలని భావిస్తున్నట్లు స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా వ్యాఖ్యానించాడు. వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్, ఆసియా క్రీడలు, డైమండ్‌ లీగ్‌ కోసం త్వరలోనే సన్నాహకాలు మొదలు పెడతానని నీరజ్‌ చెప్పాడు.

హ్యాండ్‌బాల్‌ అభివృద్ధికి రూ. 240 కోట్లు 
న్యూఢిల్లీ: దేశంలో హ్యాండ్‌బాల్‌ క్రీడకు మరింత గుర్తింపు తెచ్చేందుకు కార్పొరేట్‌ సంస్థ బ్లూ స్పోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ముందుకు వచ్చింది. వచ్చే ఐదేళ్లలో హ్యాండ్‌బాల్‌ అభివృద్ధికి రూ. 240 కోట్లు అందజేస్తామని బ్లూ స్పోర్ట్స్‌ ప్రకటించింది. పురుషుల, మహిళల టీమ్‌ల కోసం రూ. 120 కోట్ల చొప్పున, మరో రూ. 35 కోట్లు ప్రాధమిక స్థాయిలో ఆట కోసం ఇస్తామని వెల్లడించింది. హ్యాండ్‌బాల్‌ సమాఖ్య ఆధ్వర్యంలో జరగనున్న ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్‌ లీగ్‌ నిర్వహణా హక్కులు ఈ సంస్థ వద్దే ఉన్నాయి.

చదవండి: తాలిబన్‌ ముప్పు.. పాక్‌ చేరిన అఫ్ఘాన్‌ మహిళల ఫుట్‌బాల్‌ జట్టు

మరిన్ని వార్తలు