తీవ్రంగా గాయపడిన ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌

22 Sep, 2022 11:58 IST|Sakshi

ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌.. నెదర్లాండ్స్‌కు చెందిన మహిళా సైక్లిస్ట్‌ అనెమిక్‌ వాన్‌ లూటెన్‌కు పెను ప్రమాదం తప్పింది.సైక్లింగ్‌ రేసింగ్‌లో పట్టుతప్పడంతో బారియర్‌కు తాకి కిందపడిన లూటెన్‌ తీవ్ర గాయాలపాలైంది. విషయంలోకి వెళితే ఆస్ట్రేలియాలోని వోల్లోంగాంగ్లోలో నిర్వహిస్తున్న రోడ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో బుధవారం మిక్స్‌డ్‌ టీమ్‌ ట్రయల్‌ రెండో రౌండ్‌ జరిగింది.

టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగిన వాన్‌ లూటెన్‌ ర్యాంప్‌ నుంచి స్టార్ట్‌ తీసుకోగానే.. డౌన్‌కు వెళుతున్న సమయంలో సైకిల్‌ పట్టుతప్పింది. దీంతో బారియర్‌కు తాకి కిందపడిన ఆమె తలకు చేతులను అడ్డుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె మోచేతికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆమె వెనకాల ఉన్న రేసర్‌ వాన్‌ జిక్‌తో పాటు ముందు వెళ్తున్న రిజనే మార్కస్‌లు షాక్‌కు గురయ్యారు. కానీ అప్పటికే గేమ్‌ ప్రారంభం కావడంతో సైక్లింగ్‌ను కంటిన్యూ చేశారు.

దీనికి సంబంధించిన వీడియో (UCI World Tour) తన ట్విటర్‌లో షేర్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ''మెకానికల్‌ సమస్య వల్ల డచ్‌ సూపర్‌స్టార్‌కు ప్రమాదం జరిగింది. నిజంగా డచ్‌కు ఈరోజు నిరాశపరిచింది'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. కాగా ప్రమాదంపై అనెమిక్‌ వాన్‌ లూటెన్‌ స్పందించింది. ''కాసేపు ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ సైకిల్‌ టైర్‌ పగలడంతో స్కిడ్‌ అయ్యాను. అంతే రోడ్డు పక్కనున్న బారియర్‌కు గుద్దుకుంది. బ్యాలెన్సింగ్‌ చేయకపోవడం వల్ల ఇది జరిగిందని అనుకుంటున్నా. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నా'' అంటూ పేర్కొంది. కాగా నెదర్లాండ్స్‌కు చెందిన అనెమిక్‌ వాన్‌ లూటెన్‌.. టోక్యో ఒలింపిక్స్‌ 2020లో టైమ్‌ ట్రయల్‌లో స్వర్ణం, రోడ్‌ రేస్‌లో రజతం గెలిచి చరిత్ర సృష్టించింది.

చదవండి: రోజర్‌ ఫెదరర్‌ కీలక వ్యాఖ్యలు..

కోహ్లిని కలిసిన వివాదాస్పద పారిశ్రామికవేత్త

మరిన్ని వార్తలు