PV Sindhu ఫేవరెట్‌ ఫుడ్‌ ఏంటో తెలుసా?

31 Jul, 2021 15:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  టోక్యో ఒలింపిక్స్ 2020లో  మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకువచ్చిన భారత షట్లర్‌ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. 
శనివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సింధు చైనాకు చెందిన తైజుయింగ్‌ చేతిలో ఓడిపోవడంతో భారత బంగారు పతకం ఆశలకు తెరపడింది.  అయితే కాంస్య పతకం ఆశలు ఇంకా మిగిలే ఉన్నాయి. దీని కోసం సింధు చైనా షట్లర్ పింగ్ జియావోతో తలపడనుంది.  సింధు  క్యాంస్య పతకం  తీసుకురానుందనే ఆశలు భారీగానే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. పూర్తి ఫిట్‌గా కనిపించే ఆమె తన బరువును,  ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రొటీన్డ్‌ ఫుడ్‌ తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. 

ప్రధానంగా ఆమె బరువు, హైడ్రేషన్ ,  ప్రోటీన్ ఆహారంతో సింధు ఫుడ్‌  ఆధారపడి ఉంటుంది. 

బ్రేక్‌ ఫాస్ట్‌: బ్రేక్‌ ఫాస్ట్‌ పాలు, గుడ్లు, ఇతర ప్రొటీన్లతో  నిండి  ఉంటుంది. పండ్లు కూడా  తీసుకుంటారు. ఇక శిక్షణా సమయంలో సెషన్‌ల  మధ్య మరింత యాక్టివ్‌గా,  బలంగా ఉండేందుకు  డ్రై ఫ్రూట్స్  లాంటివి  తీసుకుంటారు.

లంచ్‌ అండ్‌ డిన్నర్‌: సింధు రోజూ రెండుపూటలా భోజనంలో రైస్‌ ఉండేలా చూసుకుంటారు. దీంతోపాటు కూరగాయలు కూడా తీసుకుంటారు.  అలాగే టోర్నమెంట్ల సమయంలో అన్నం, చికెన్‌ తీసుకుంటారు. అలాగే ఆరోగ్యాన్నినియంత్రించుకునే చర్యల్లో భాగంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి బ్లడ్‌ టెస్ట్‌ చేయించుకుంటారు. ఈ ఫలితాల కనుగుణంగా తన డైట్‌ను ఆమె ఎడ్జస్ట్‌ చేసుకుంటారు. 

ఇక చివరగా మ్యాచ్‌ గెలిచిన తరువాత ఫాస్ట్‌ ఫుడ్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తారట. కేకులు, పేస్ట్రీలు, ఐస్ క్రీమ్, చాక్లెట్లను ఎంచక్కా  ఎంజాయ్‌ చేస్తారట. అయితే సాధారణంగా  సింధు తల్లి  స్వయంగా ఇవన్నీ దగ్గరుండి చూసుకుంటారట. 

ఇంకా అరటిపండ్లు, ప్రోటీన్ షేక్  స్నాక్ బార్‌లు ఈ మూడు తీసుకుంటానని సింధు జాతీయ మీడియాతో చెప్పారు. అలగే  భారీ ట్రైనింగ్‌ సెషన్ తర్వాత ఎనర్జీ కోసం స్నాక్ బార్‌లపైనే ఆధారపడతానని చెప్పారు. సాధారణంగా మ్యాచ్ తర్వాత అరగంటలోపు ఏదో ఒకటి తినాలి, ఆ తర్వాత స్ట్రెచ్‌స్‌ చేసి, రెస్ట్‌ తీసుకుంటానని సింధు వెల్లడించారు.

ఇక చీట్‌ మీల్‌లో భాగంగా హైదరాబాదీ బిర్యానీ తన మెనూలో టాప్‌లో ఉంటుందని ఆమె చెప్పారు. అలాగే ప్రొఫెషనల్ అథ్లెట్లు తక్కువ నూనె, కూరగాయలతో చేసిన నూడుల్స్, స్పఘెట్టి, పాస్తా లాంటివి  కూడా తీసుకుంటారని కూడా  సింధు  చెప్పారు.


కోచ్‌ శ్రీకాంత్‌ వర్మ ఏమన్నారంటే..
ఆమె కోసం ప్రత్యేకంగా హై-పెర్ఫార్మెన్స్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను కస్టమైజ్ చేశామని సింధు కోచ్‌ శ్రీకాంత్‌ వర్మ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ముఖ్యంగా సింధు  ఆట,  బాడీ తీరు, ఆమె బలాబలాలు వీటన్నింటినీ దృష్టి  ఉంచుకుని ఇదంతా రూపొందిస్తామని చెప్పారు.  పతకాల  బరిలో నిలిచే క్రీడాకారులు హైఇంటెన్సిటీ షెడ్యూల్‌కు సిద్ధంగా ఉంటారన్నారు. ముఖ్యంగా వారంలో ఆరు రోజులు, రెండున్నర గంటలు కఠినమైన శిక్షణా విధానాన్ని సింధు అవలంబిస్తోందని శ్రీకాంత్‌ వెల్లడించారు. 

అలాగే సింధు ట్రైనింగ్‌కు ఎపుడూ నో చెప్పదు..అదే ఆమెలోని గొప్పతనం..శిక్షణ ఎంత కఠినంగా ఉన్నా, తాను ఎంత బిజీగా ఉన్నా ఎపుడూ నవ్వుముఖంతో సిద్ధంగా ఉంటుందన్నారు. ఎందుకంటే ఒలింపిక్స్‌లో  ప్రతీ రౌండ్ ఫైనల్‌ లాంటిదే. అత్యుత్తమ ఫామ్‌ని అందుకోవడమే లక్క్ష్యమని ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీలో హెడ్ స్ట్రెంత్, కండిషనింగ్  కోచ్‌గా ఉన్నారు శ్రీకాంత్‌ వర్మ.

మరిన్ని వార్తలు