Hockey Varinder Singh Death: ఒలంపిక్‌ పతక విజేత, భారత హాకీ దిగ్గజం కన్నుమూత

28 Jun, 2022 15:24 IST|Sakshi

ఒలంపిక్‌ పతక విజేత, వరల్డ్‌కప్‌ సాధించిన భారత హాకీ జట్టు సభ్యుడైన వారీందర్ సింగ్‌(75) కన్నుమూశారు. స్వస్థలం జలంధర్‌లో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వారీందర్‌ సింగ్‌ మరణం పట్ల హాకీ ఇండియా సంతాపం వ్యక్తం చేసింది. 

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. ఈ సందర్భంగా వారీందర్‌ సింగ్‌ లేని లోటు పూడ్చలేనిదంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. 

పాకిస్తాన్‌పై విజయంలో భాగస్వామిగా..
1947లో పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించిన వారీందర్‌ సింగ్‌ హాకీపై మక్కువ పెంచుకున్నారు. అంచెలంచెలుగా ఎదుగుతూ భారత హాకీ జట్టులో చోటు సంపాదించారు. హాకీ వరల్డ్‌కప్‌-1975 టోర్నీలో పాకిస్తాన్‌ను 2-1 తేడాతో ఓడించి స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడు.

అదే విధంగా... 1972 నాటి మ్యూనిచ్‌ ఒలంపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో ఆయన భాగస్వామిగా ఉన్నారు. అంతేగాక 1973లో ప్రపంచకప్‌లో రజతం గెలిచిన జట్టులో సభ్యుడు.

ఇక 1974, 1978 ఏసియన్‌ గేమ్స్‌లో రజతం గెలిచిన భారత జట్టుకు ఆయన ప్రాతినిథ్యం వహించారు. కాగా హాకీ ఆటగాడిగా క్రీడా రంగానికి చేసిన సేవకు గానూ 2007లో ప్రతిష్టాత్మక ధ్యాన్‌చంద్‌ జీవన సాఫల్య పురస్కారాన్ని వారీందర్‌ సింగ్‌ అందుకున్నారు. 

చదవండి: India T20 Captain: అలా అయితే రోహిత్‌ స్థానంలో ఇకపై అతడే టీ20 కెప్టెన్‌!

మరిన్ని వార్తలు