బెయిల్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న ఒలింపిక్స్‌ పతక విజేత

4 Oct, 2021 20:55 IST|Sakshi

Wrestler Sushil Kumar Seeks Bail In Murder Case: సాగర్‌ రాణా అనే యువ రెజ్లర్‌ హత్య కేసులో ఒలింపిక్స్‌ పతక విజేత సుశీల్ కుమార్ బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు.  సోమవారం ఢిల్లీలోని రోహిణి కోర్టులో అతని తరపు న్యాయవాది బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు పోలీసులు తప్పుడు కేసులో ఇరికించారని సుశీల్‌ తన పిటిషన్‌లో ప్రస్తావించారు. అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి శివాజీ ఆనంద్‌ రేపు ఈ పిటిషన్‌ను విచారించనున్నారు. కాగా, ఢిల్లీలోని ఛత్రాసాల్ స్టేడియం వ‌ద్ద 23 ఏళ్ల సాగ‌ర్ రాణాను హ‌త్య చేసిన కేసులో సుశీల్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు మే 23న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సుశీల్‌.. 2008, 2012 విశ్వక్రీడల్లో కాంస్యం, రజత పతకాలు సాధించాడు.
చదవండి: ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌పై రోహిత్‌ శర్మ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు