టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారులపై ఆంక్షలు

19 Jun, 2021 18:28 IST|Sakshi

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారులపై జపాన్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీని ప్రకారం.. ఒలంపిక్స్‌లో పాల్గొంటున్న భారత అథ్లెట్లు, కోచ్‌లు, సిబ్బందిపై విధించిన ఆంక్షలను తప్పక పాటించాలని తెలిపింది. టోక్యోకు వచ్చే ముందు అందరూ కోవిడ్ టెస్ట్‌లు చేయించుకోవాలని, వారంపాటు ప్రతిరోజు టెస్టు చేసుకోవాలని ఆదేశించింది. ఇదే క్రమంలో టోక్యో చేరిన తర్వాత 3 రోజులపాటు భారత క్రీడాకారులు ఎవరినీ కలవకూడదని ఆదేశించింది. కాగా జపాన్ ఆంక్షలను భారత ఒలింపిక్ సంఘం( ఐఓఏ) తప్పుపట్టింది.

చదవండి: బాటిల్సే కాదు.. ఏం ముట్టుకున్నా మోతే ఇక!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు