India Vs Leicestershire Practice Match: కోహ్లి వికెట్‌పై లీస్టర్‌షైర్‌ బౌలర్‌ స్పందన

25 Jun, 2022 17:47 IST|Sakshi

 Roman Walker: ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా టీమిండియా లీస్టర్‌షైర్‌తో 4 రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో లీస్టర్‌షైర్‌ బౌలర్‌ రోమన్‌ వాకర్‌ 5 వికెట్ల ప్రదర్శనతో రెచ్చిపోవడంతో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే (246/8 డిక్లేర్‌) పరిమితం కాగా.. టీమిండియా బౌలర్ల ధాటికి లీస్టర్‌షైర్‌ సైతం తొలి ఇన్నింగ్స్‌లో  244 పరుగులకే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 90 పరుగులు చేసింది. శ్రీకర్‌ భరత్‌, విహారి క్రీజ్‌లో ఉన్నారు. 

ఇదిలా ఉంటే, తొలి రోజు ఆటలో కోహ్లి, రోహిత్‌ సహా మొత్తం ఐదు వికెట్లు (5/25) పడగట్టిన రోమన్‌ వాకర్‌ కోహ్లి వికెట్‌ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెరీర్‌లో తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ ఆడుతున్న 21 ఏళ్ల వాకర్ కోహ్లి వికెట్‌ పడగొట్టడంపై స్పందిస్తూ..

తొలి ఇన్నింగ్స్‌లో నా పర్ఫామెన్స్‌ సంతృప్తినిచ్చింది.. ప్రపంచంలోనే మేటి బ్యాటర్‌ అయిన విరాట్‌ కోహ్లి వికెట్‌ నాకు జీవితకాలం గుర్తుండిపోతుంది.. కోహ్లి వికెట్‌ సాధించిన అనంతరం నా టీమ్ మేట్స్‌ కొందరు మెసేజ్‌ చేశారు.. కోహ్లి వికెట్ గురించి నీ మనవళ్లతో గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు.. అవును వరల్డ్ క్లాస్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లిని ఔట్‌ చేశానని నా మనవళ్లతో గర్వంగా చెప్పుకుంటానని అన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణించిన వాకర్‌ 57 బంతుల్లో 7 ఫోర్లతో 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 
చదవండి: సిక్సర్‌తో పంత్‌ అర్థశతకం.. ఫామ్‌లోకి వచ్చినట్టేనా!
 

మరిన్ని వార్తలు