Australian Open: రష్యా, బెలారస్‌ జాతీయ జెండాలపై నిషేధం

17 Jan, 2023 18:42 IST|Sakshi

ఆస్ట్రేలియా ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో భాగంగా ర‌ష్యా, బెలార‌స్ దేశాల జాతీయ జెండాల‌పై నిషేధం విధించారు. టోర్న‌మెంట్‌లోని ఓ టెన్నిస్ కోర్టులో జ‌రిగిన ఘ‌ట‌న ఆధారంగా నిర్వాహ‌కులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. మెల్‌బోర్న్ పార్క్‌లోకి జాతీయ జెండాల‌ను తీసుకువ‌చ్చేందుకు తొలుత ప్రేక్ష‌కుల‌కు అనుమ‌తి ఇచ్చారు.

అయితే ఉక్రెయిన్ ప్లేయ‌ర్ కేత‌రినీ బెయిడా, ర‌ష్యా ప్లేయ‌ర్ క‌మిల్లా ర‌ఖిమోవా మ‌ధ్య మ్యాచ్ జరుగుతున్న స‌మ‌యంలో కొంద‌రు ప్రేక్ష‌కులు ర‌ష్యా జెండాల‌ను ప్ర‌ద‌ర్శించారు. దీంతో నిర్వాహ‌కులు త‌క్ష‌ణ‌మే ఆ రెండు దేశాల జెండాల‌పై బ్యాన్ విధించారు. అంతేకాదు త‌మ ప్లేయ‌ర్‌ను ర‌ష్య‌న్లు వేధించిన‌ట్లు ఉక్రెయిన్ అభిమానులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తక్షణమే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టెన్నిస్ ఆస్ట్రేలియాను కోరారు. దీంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నిర్వాహకులు ఈ రెండు దేశాల జాతీయ జెండాల ప్రదర్శించకుండా నిషేధం విధించింది.

చదవండి: షార్ట్‌ టెంపర్‌కు మారుపేరు.. అభిమానిపై తిట్ల దండకం

సంచలనం.. మాజీ వరల్డ్‌ నెంబర్‌ వన్‌కు బిగ్‌షాక్‌

మరిన్ని వార్తలు