దక్షిణాఫ్రికా టీ20 లీగ్.. వేలంలో 500 మందికి పైగా ఆటగాళ్లు!

4 Sep, 2022 21:00 IST|Sakshi
twitter pic

దక్షిణాఫ్రికా సరికొత్త టీ20 టోర్నీ (ఎస్‌ఏ20 లీగ్‌) వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా ఈ టోర్నీ వేలంలో 18 దేశాలకు చెందిన 500 మంది పైగా ఆటగాళ్లు తమ పేర్లును నమోదు చేసుకున్నారు. ఈ ఎస్‌ఏ20కు సంబంధించిన వేలం సెప్టెంబర్‌ 19న జరగనుంది. అదే విధంగా ఈ వేలంలో సౌతాఫ్రికా నుంచి మొత్తం 17 మంది తమ పేర్లను రిజిస్టర్‌ చేయించుకున్నారు.

కాగా టోర్నీ నిభందనల ప్రకారం ప్రతీ ఫ్రాంచైజీ 10 మంది ప్రోటీస్‌ ఆటగాళ్లతో పాటు 7 మంది విదేశీ ప్లేయర్స్‌తో ఒప్పందం కుదర్చుకోవాలి. అదే విధంగా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఎడుగురు స్థానిక​ఆటగాళ్లతో పాటు నలుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఇవ్వాలి. ఇక ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొనబోతున్నాయి.

అయితే మొత్తం ఆరు జట్లును ఐపీఎల్‌ ఫ్రాంచైజీలే దక్కించుకోవడం గమనార్హం. కేప్‌టౌన్‌, జోహెన్నెస్‌బర్గ్‌, డర్బన్‌, పోర్ట్‌ ఎలిజిబెత్‌, ప్రిటోరియా, పార్ల్‌ ఫ్రాంఛైజీలను  ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌, సన్‌రైజర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకున్నాయి.
చదవండి: IPL 2023: సన్‌రైజర్స్‌ బాటలోనే పంజాబ్‌.. కొత్త కోచ్‌ ఎంపిక ఖరారు

మరిన్ని వార్తలు