మాజీ క్రికెటర్‌ సోదరుడు కాల్చివేత

8 Oct, 2020 15:46 IST|Sakshi
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ వెర్నోన్‌ ఫిలాండర్‌

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ వెర్నోన్‌ ఫిలాండర్‌ సోదరుడు టైరోన్‌ ఫిలాండర్‌ కాల్చివేతకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం టైరోన్‌ స్వస్థలమైన రావెన్స్‌మీడ్‌లో చోటు చేసుకుంది. తన సోదరుడ్ని కొందరు దుండగులు కాల్చివేసిన విషయాన్ని వెర్నోన్‌ ఫిలాండర్‌ ట్వీటర్‌ ద్వారా వెల్లడించాడు. ‘ నా సోదరుడు టైరోన్‌ దారుణ హత్యకు గురయ్యాడు. మా హోమ్‌ టౌన్‌లోనే ఇది జరిగింది. ఈ కష్టసమయంలో మా కుటుంబానికి ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నారు.(చదవండి: శాంసన్‌ రాత మారేనా? మళ్లీ అదే డ్రామానా?)

ఇది పోలీసుల దర్యాప్తులో ఉంది. ఈ విషయంలో పోలీసులకు మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించనందున ఎటువంటి తప్పుడు వార్తలు రాయొద్దు. ఊహాగానాలతో దర్యాప్తు కష్టంగా మారిపోతుంది. టైరోన్‌ ఎప్పుడూ మా మనసుల్లో ఉంటాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. టైరోన్‌ కాల్చబడ్డ సమయంలో పక్కంటి వారికి వాటర్‌ డెలివరీ చేయడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు