Pak Vs Aus 2nd Test: ఆసీస్‌ బౌలర్ల ప్రతాపం.. కుప్పకూలిన పాకిస్తాన్‌.. ఫాలో ఆన్‌ ఆడించని కమిన్స్‌!

15 Mar, 2022 08:34 IST|Sakshi

Pak Vs Aus 2nd Test- కరాచీ: ఆస్ట్రేలియా బౌలర్ల ప్రతాపం ముందు సొంతగడ్డపై పాకిస్తాన్‌ బ్యాటర్లు చేతులెత్తేశారు. కనీస స్థాయి ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయిన ఆ జట్టు రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఆసీస్‌కు ఏకంగా 408 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (36)దే అత్యధిక స్కోరు. చక్కటి రివర్స్‌ స్వింగ్‌తో మిచెల్‌ స్టార్క్‌ 3 వికెట్లు పడగొట్టగా, తొలి టెస్టు ఆడుతున్న లెగ్‌స్పిన్నర్‌ మిచెల్‌ స్వెప్సన్‌ 2 వికెట్లు తీశాడు. అసాధారణ ఆధిక్యం లభించినా సరే, ప్రత్యర్థిని ఫాలోఆన్‌ ఆడించకుండా కెప్టెన్‌ కమిన్స్‌ మళ్లీ బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా సోమవారం ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోయి 81 పరుగులు చేసింది.

వార్నర్‌ (7) పెవిలియన్‌ చేరగా...లబుషేన్‌ (37 బ్యాటింగ్‌), ఉస్మాన్‌ ఖాజా (35 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఓవరాల్‌గా ఆసీస్‌ 489 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 505/8తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 51 పరుగులు జోడించి 556/9 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

చదవండి: Ind Vs Sl 2nd Test- WTC: దక్షిణాఫ్రికాలో ఓడటం మన అవకాశాలను దెబ్బ తీసింది.. కానీ: రోహిత్‌ శర్మ   

మరిన్ని వార్తలు