Pakistan vs England, 6th T20I - Viral Video: ఇంగ్లండ్‌తో పాకిస్తాన్ ఆరో టీ20 సందర్భంగా అంపైర్ అలీమ్ దర్‌కు గాయమైంది. కాసేపు నొప్పితో విలవిల్లాడిన అతడు.. తర్వాత అంపైరింగ్ కొనసాగించాడు. కాగా ఏడు మ్యాచ్‌ల టీ20, మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో శుక్రవారం నాటి ఆరో టీ20లో తొలుత ఆతిథ్య జట్టు బ్యాటింగ్ చేసింది. ఇందులో భాగంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హైదర్ అలీ.. ఆరో ఓవర్లో రిచర్డ్ గ్లీసెన్ బౌలింగ్‌లో పుల్‌షాట్ బాదాడు. ఆ సమయంలో లెగ్ అంపైర్ స్థానంలో ఉన్న అలీమ్ దర్ తొడ వెనుక భాగంలో బంతి గట్టిగా తగిలింది.
అయితే, అదృష్టవశాత్తూ అతడికి పెద్దగా గాయమేమీ కాలేదు. కొన్ని క్షణాల పాటు నొప్పితో బాధపడిన అలీమ్ వెంటనే సర్దుకుని మళ్లీ తన డ్యూటీలోకి దిగాడు. ఇక బౌలర్ రిచర్డ్ అలీమ్ దగ్గరకు వెళ్లి పరామర్శించగా.. పర్లేదు అంతా బాగానే ఉంది అన్నట్లుగా అతడు సమాధానమిచ్చాడు.
ఇదేంట్రా బాబు ఇలా కొట్టేశావు
ఇందుకు సంబంధించిన వీడియోను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇదేంట్రా బాబు ఇలా కొట్టేశావు అన్నట్లుగా ఆ అంపైర్ ఎక్స్‌ప్రెషన్ చూడండి. ఏదేమైనా అతడికి ప్రమాదం తప్పింది. ఫైనల్‌గా పాక్ మ్యాచ్ ఓడింది’’ అని మీమ్స్‌తో ట్రోల్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ విధ్వంసకర ఆట తీరుతో చెలరేగడంతో ఇంగ్లండ్.. పాక్ విధించిన 170 పరుగుల లక్ష్యాన్ని సూనాయాసంగా ఛేదించింది. ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 3-3తో సమం చేసింది. ఇదిలా ఉంటే.. పాక్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్‌రూమ్‌కు వెళ్లిన హైదర్ అలీ.. కళ్లు తిరిగినట్లుగా అనిపించడంతో కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అయినప్పటికీ ఈ యువ బ్యాటర్ పరిస్థితిలో మార్పు రాకపోవడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు.
చదవండి: Irani Cup 2022: కుప్పకూలిన సౌరాష్ట్ర టాపార్డర్.. 0,4,0,1,2... 98 పరుగులకే ఆలౌట్
Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు: పాక్ మాజీ క్రికెటర్
Ouch! 😬#PAKvENG | #UKSePK pic.twitter.com/DaD6EwSaVV
— Pakistan Cricket (@TheRealPCB) September 30, 2022