ఆ సిరీస్‌లో నో డీఆర్‌ఎస్‌.. 

10 Sep, 2021 18:06 IST|Sakshi

కరాచీ: ఆధునిక క్రికెట్‌లో డీఆర్‌ఎస్‌ (డెసిషన్‌ రివ్యూ సిస్టమ్‌) లేకుండా మ్యాచ్‌లు జరగడం దాదాపుగా అసాధ్యం. ఐసీసీ సభ్య దేశాలన్నీ తమ తమ అంతర్జాతీయ మ్యాచ్‌లకు స్వయంగా డీఆర్‌ఎస్‌(ఐసీసీ ఆమోదించిన డీఆర్‌ఎస్‌ సర్వీస్‌ ప్రొవైడర్లతోనే) సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఆ సదుపాయాన్ని కల్పించుకోలేకపోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆ బోర్డు ప్రతినిధులే వెల్లడించారు. 

సెప్టెంబర్‌ 17 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లకు డీఆర్‌ఎస్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు అందుబాటులో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పీసీబీ ప్రతనిధి వివరణ ఇచ్చాడు. ఇదే అంశానికి సంబంధించి మరో అధికారి మాట్లాడుతూ.. ఈ సిరీస్‌లకు సంబంధించి పీసీబీ మీడియా ప్రసార హక్కులను ఆలస్యంగా విక్రయించడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని అన్నారు. అయితే, వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో డీఆర్‌ఎస్‌ విధానం అమలు చేస్తామని వారు వెల్లడించారు.
చదవండి: రీ షెడ్యూల్‌ అయినా సిరీస్‌తో సంబంధం ఉండదు: ఈసీబీ చీఫ్‌
 

మరిన్ని వార్తలు