WI Vs Pak: పాకిస్తాన్‌ 217 ఆలౌట్‌

14 Aug, 2021 05:43 IST|Sakshi

కింగ్‌స్టన్‌: వెస్టిండీస్‌తో కింగ్‌స్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. ఫవాద్‌ ఆలమ్‌ (56; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా... అష్రఫ్‌ (44; 8 ఫోర్లు), బాబర్‌ ఆజమ్‌ (30; 4 ఫోర్లు) రాణించారు. విండీస్‌ బౌలర్లలో సీల్స్, హోల్డర్‌ మూడేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌ కడపటి వార్తలు అందే సమయానికి 38 ఓవర్లలో 5 వికెట్లకు 100 పరుగులు చేసింది.

చదవండి: Ind Vs Eng: రెండో రోజు బౌలర్లదే...

మరిన్ని వార్తలు