'కర్మ ఫలితం అనుభవించాల్సిందే'‌.. ఎంతైనా పాక్‌ క్రికెటర్‌!

15 Sep, 2022 08:54 IST|Sakshi

మాములుగా క్రికెట్‌లో రనౌట్‌ అంటే హార్ట్ బ్రేకింగ్‌ లాంటిది. మ్యాచ్‌ ఉత్కంఠస్థితిలో ఉన్నప్పుడు కీలక బ్యాటర్‌ రనౌట్‌గా వెనుదిరిగితే విజయపథంలో ఉన్న జట్టుకు చాలా నష్టం కలిగిస్తుంది. అదే రనౌట్‌ ప్రత్యర్థి జట్టుకు ఊహించని విజయాన్ని అందింస్తుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే రనౌట్‌ మాత్రం కాస్త వింతగా ఉంది. బద్దకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉన్న పాక్‌ క్రికెటర్‌ రనౌట్‌ అయిన తీరు నవ్వులు పూయిస్తుంది. 

విషయంలోకి వెళితే.. పాకిస్తాన్‌కు చెందిన రోహెయిల్‌ నజీర్‌ అనే వికెట్‌ కీపర్‌ ముల్తాన్‌ వేదికగా నేషనల్‌ టి20 కప్‌లో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో రోహెయిల్స్‌ నార్త్రన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కైబర్‌ పక్తున్వాతో మ్యాచ్‌లో బ్యాటింగ్‌ వచ్చిన నజీర్‌ ఫ్రీ హిట్‌ను భారీ షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి లేచింది. ప్రత్యర్థి జట్టు ఫీల్డర్‌ క్యాచ్‌ తీసుకున్నాడు. అయితే ఫ్రీ హిట్‌ కావడంతో ఔట్‌గా పరిగణించరు. ఇక్కడివరకు బాగానే ఉంది.

నజీర్‌ సింగిల్‌ కోసం పరిగెత్తకుండా బద్దకాన్ని ప్రదర్శించాడు. క్రీజులోకి వచ్చేవరకు కూడా ఏదో అత్తారింటికి వెళ్లినట్లు మెళ్లిగా నడుచుకుంటూ వచ్చాడు. ఇది గమనించిన ఫీల్డర్‌.. ప్రీ హిట్‌లో రనౌట్‌కు అవకాశముందని తెలిసి వెంటనే వికెట్లకు గిరాటేశాడు. అంతే నజీర్‌ క్రీజులో బ్యాట్‌ పెట్టడానికి 10 సెకన్ల ముందే బంతి వికెట్లను గిరాటేసింది. అప్పటికి తన బద్దకాన్ని వదిలించుకోకుండా నవ్వుతూ ఉండిపోయాడు. అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేయగా.. అందులో నజీర్‌ రనౌట్‌ అని తేలింది. దీంతో​అతని ఇన్నింగ్స్‌ ఊహించని రీతిలో ఎండ్‌ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ వినూత్న రీతిలో కామెంట్స్‌ చేశారు. ''బద్దకానికి బ్రాండ్‌ అంబాసిడర్‌లా ఉన్నాడు.. వీడిని క్రికెటర్‌ అని ఎవరైనా అంటారా''.. ''కర్మ ఫలితం అనుభవించాల్సిందే''.. ''పాక్‌ క్రికెటర్లతో ఏదైనా సాధ్యమే''.. అంటూ పేర్కొన్నారు.

A post shared by Pakistan Cricket (@therealpcb)

చదవండి: పవర్‌ హిట్టర్‌ రీఎంట్రీ.. టి20 ప్రపం‍చకప్‌కు విండీస్‌ జట్టు

మరిన్ని వార్తలు