Asia Cup 2022: కింగ్‌ కోహ్లి అద్భుతమైన సెంచరీ.. పాక్‌ ఆటగాళ్ల ప్రశంసల జల్లు!

9 Sep, 2022 16:50 IST|Sakshi
విరాట్‌ కోహ్లి(PC: BCCI twitter)

ఆసియాకప్‌-2022లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. కోహ్లి తన 71వ అంతర్జాతీయ సెంచరీ కోసం 1020 రోజులు నిరీక్షించాల్సి వచ్చింది. అదే విధంగా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కింగ్‌ కోహ్లికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో కోహ్లిపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అంతేకాకుండా దాయాది దేశం పాకిస్తాన్‌ ఆటగాళ్లు సైతం రన్‌మిషన్‌ను ప్రశంసలలో ముంచెత్తారు. ట్విటర్‌ వేదికగా హాసన్‌ అలీ, మహ్మద్‌ అమీర్‌, కమ్రాన్‌ ఆక్మల్‌ వంటి పాక్‌ ఆటగాళ్లు కోహ్లిని అభినందిచారు.

"ఫామ్‌ తాత్కాలికమైనది.. క్లాస్‌ అనేది ఎప్పటికీ పోదు. కోహ్లి ఆటను ఎల్లప్పుడూ చూడడానికి ఇష్టపడతాను. ఈ మ్యాచ్‌లో విరాట్‌ అద్భుతమైన సెంచరీ సాధించాడు. కోహ్లి నిజమైన కింగ్‌" అంటూ ట్విటర్‌ వేదికగా ఆక్మల్‌ పేర్కొన్నాడు.

మరో వైపు హాసన్‌ అలీ  "ది గ్రేట్‌ కోహ్లి ఈజ్‌ బ్యాక్‌" అని ట్వీట్‌ చేశాడు. కాగా ఈ మెగా ఈవెంట్‌ గ్రూపు దశలో పాకిస్తాన్‌పై విజయం సాధించిన టీమిండియా.. సూపర్‌-4లో మాత్రం దాయాది జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది. ఇక సూపర్‌-4 దశలో వరుసగా రెండు ఓటములు చవిచూసిన భారత్‌ ఈ టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే.
చదవండి: Asia Cup 2022: తొలిసారి బౌలింగ్ చేసిన దినేష్ కార్తీక్.. వీడియో వైరల్‌!

మరిన్ని వార్తలు