కోహ్లీ ఫ్యాన్స్‌ జాబితాలో ప్రముఖ పాక్‌ క్రికెటర్‌ భార్య..

6 Jun, 2021 20:36 IST|Sakshi

ఇస్లామాబాద్‌: టీమిండియా డైనమిక్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలి కాలంలో అతనికి దాయాది దేశమైన పాక్‌లోనూ విపరీతమైన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఏర్పడింది. 2019 వన్డే ప్రపంచకప్‌ సమయంలో కోహ్లీని మాకిచ్చేయండి అంటూ పాక్‌ యువతి రిజ్లా రెహాన్ తెగ హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత చాలా మంది పాక్‌ అమ్మాయిలు.. బహిరంగంగా కోహ్లీకి లవ్‌ ప్రపోజ్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఓ అమ్మాయి అయితే ఏకంగా స్టేడియంలోనే విరాట్ నన్ను పెళ్లి చేసుకుంటావా..? అంటూ ప్లకార్డ్‌ని ప్రదర్శించింది. తాజాగా కోహ్లీ అభిమానుల జాబితాలో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ భార్య షామియా ఆర్జూ కూడా చేరింది. 

ఇటీవల, సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన షామియా‌.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ విషయాన్ని వెల్లడించంది. ‘‘నీ ఫేవరెట్ బౌలర్‌ కచ్చితంగా హసన్ అలీనే అయ్యుంటాడు. మరి నీ ఫేవరెట్ బ్యాట్స్‌మెన్ ఎవరు.. ?’’ అని ఆ నెటిజన్‌ ప్రశ్నించడంతో.. ఆమె టక్కున విరాట్ కోహ్లీ పేరు చెప్పింది. ఇదిలా ఉంటే, షామియా స్వస్థలం భారత్‌లోని హర్యానా రాష్ట్రం. వాళ్ల ఫ్యామిలీ ప్రస్తుతం ఢిల్లీలో సెటిలైంది. ఎమిరేట్ ఎయిర్‌లైన్స్‌లో ప్లైయిట్ ఇంజినీర్‌గా పని చేస్తున్న షామియా‌ని మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా హసన్ అలీ మూడేళ్ల క్రితం దుబాయ్‌లో కలిశాడు. కొన్ని రోజులు ఫ్రెండ్స్‌గా ఉన్న ఈ ఇద్దరూ ఆ తర్వాత ప్రేమించుకుని, పెద్దల్ని ఒప్పించి 2019లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అప్పట్లో సానియా మీర్జా, షోయబ్ మాలిక్ దంపతులు దుబాయ్‌లో పార్టీ ఇవ్వడం చర్చనీయాంశమైంది.
చదవండి: వాళ్లిద్దరి కెప్టెన్సీ ఒకేలా ఉంటుంది.. ఆ విషయంలో ధోనీ స్టైల్‌ వేరు

మరిన్ని వార్తలు