అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలో తొలి క్రికెటర్‌గా..

4 Feb, 2022 21:15 IST|Sakshi

అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలో పాకిస్తాన్‌ కెప్టెన్‌ ఖాసీమ్‌ అక్రమ్‌ అరుదైన ఫీట్‌ సాధించాడు. ఐదో ప్లేఆఫ్‌ స్థానం కోసం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఖాసీమ్‌ అక్రమ్‌.. తొలుత బ్యాటింగ్‌లో 135 పరుగులు.. ఆ తర్వాత బౌలింగ్‌లో 37 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. తద్వారా ప్రపంచకప్‌లో ఒక మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు బౌలింగ్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఖాసీమ్‌ అక్రమ్‌ ఘనతను తనదైన స్టైల్లో ట్వీట్‌ చేసింది. అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో సెంచరీతో పాటు ఐదు వికెట్ల ఘనత అందుకున్న తొలి క్రికెటర్‌గా ఖాసీమ్‌ అక్రమ్‌ నిలిచాడు. టోర్నమెంట్‌లో అక్రమ్‌ తన మార్క్‌ను స్పష్టంగా చూపించాడు.. కంగ్రాట్స్‌  అని ట్వీట్‌ చేసింది. 

చదవండి: Yash Dhull: యశ్‌ ధుల్‌ ఒక సంచలనం.. కోహ్లితో ఉ‍న్న పోలికేంటి!

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే పాకిస్తాన్‌ 238 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది.  కెప్టెన్‌ ఖాసీమ్‌ అక్రమ్‌(80 బంతుల్లో 135 నాటౌట్‌, 13 ఫోర్లు, 6 సిక్సర్లు), హసీబుల్లా ఖాన్‌(151 బంతుల్లో 136, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ముహ్మద్‌ షెహజాద్‌ 73 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 34.2 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. ఖాసీమ్‌ అక్రమ్‌ 37 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఇక శనివారం టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య ఫైనల్‌ పోరు జరగనుంది.

చదవండి: ఆకాశ్‌ చోప్రా అండర్‌-19 వరల్డ్‌ బెస్ట్‌ ఎలెవెన్‌.. టీమిండియా నుంచి ఒకే ఒక్కడు

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు