IND vs PAK: భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సిరీస్‌లపై పీసీబీ కొత్త చీఫ్‌ కీలక వాఖ్యలు

23 Dec, 2022 00:03 IST|Sakshi

ప్రపంచ క్రికెట్‌లో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌లకు ఎనలేని క్రేజ్‌ ఉంటుదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా చాలా ఏళ్ల నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు. ఈ ‍క్రమంలో భారత్‌-పాక్‌ జట్లు ఐసీసీ టోర్నీ‍లు, ఆసియా కప్‌ వంటి ఈవెంట్‌లలో మాత్రమే ముఖాముఖి తలపడుతున్నాయి. అయితే ఇరు దేశాల అభిమానులు మాత్రం చిరకాల ప్రత్యర్ధిలు ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడితే చూడాలని భావిస్తున్నారు.

ఇక 2012-13లో చివరగా  ద్వైపాక్షిక సిరీస్‌లో పాక్‌తో భారత్‌ తలపడింది.కాగా భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణపై పీసీబీ కొత్త చీఫ్‌ నజామ్ సేథీ కీలక వాఖ్యలు చేశాడు.

రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో ఇరు దేశాల ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని నజామ్ సేథీ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా బోర్డు ప్యానెల్‌ మార్పుకు ముందు న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు పీసీబీ జట్టును ఎంపిక చేయడాన్ని అతడు తప్పు బట్టాడు.

"ప్రస్తుతం పాక్‌ జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు. అయితే ప్యానల్‌ మార్పుకు ముందు కివీస్‌ సిరీస్‌కు జట్టును ప్రకటించకుండా ఉంటే బాగుండేది. కానీ పాకిస్తాన్‌లో అన్ని ప్రధాన జట్లు పర్యటించడం చాలా సంతోషంగా ఉంది. న్యూజిలాండ్‌ సిరీస్‌ మాకు చాలా ముఖ్యమైనది.

దేశవాళీ క్రికెట్‌ నుంచి మంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లను గుర్తించి జాతీయ జట్టులో అవకాశం కల్పిస్తాము" అని విలేకరుల సమావేశంలో సేథీ పేర్కొన్నాడు. కాగా స్వదేశంలో వరుసగా సిరీస్‌లు ఓడిపోవడంతో రమీజ్‌ రజాను పీసీబీ చైర్మెన్‌ పదవి నుంచి పాక్‌ ప్రభుత్వం తొలిగించింది. ఈ క్రమంలో అతడి స్థానంలో సేథీ పీసీబీ కొత్త బాస్‌గా బాధ్యతలు చేపట్టాడు.
చదవండి: IPL 2023 Auction: గ్రీన్‌కు 20, కర్రన్‌కు 19.5, స్టోక్స్‌కు 19 కోట్లు..!

>
మరిన్ని వార్తలు